Faria Abdullah: ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుర్ర హీరోయిన్స్ లో అందం, యాక్టింగ్ , డ్యాన్స్ ఈ మూడు కలిగిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ఫారియా అబ్దుల్లా కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఈమెకి కటౌట్ ప్రభాస్ లాంటి హీరో కి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత పొడవు గా ఉంటుంది. ‘జాతి రత్నాలు’ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇందులో ఈమె క్యూట్ గా చేసిన యాక్టింగ్ అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. కామెడీ టైమింగ్ కూడా అదరగొట్టింది. ఈ చిత్రం తర్వాత ఆమె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘బంగార్రాజు’,’లైక్, షేర్ & సబ్ స్క్రైబ్’, ‘రావణాసుర’ , ‘ఆ ఒక్కటి అడక్కు’ వంటి సినిమాల్లో నటించింది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే బిగ్గెస్ట్ బ్రేక్ ఈమెకి దొరకలేదు.
ఇకపోతే నేడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘మత్తు వదలరా 2 ‘ చిత్రం గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో ఫరియా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు ఈ చిత్రం లో ఆమె ఒక పాట కి లిరిక్ రైటర్ గా, సింగర్ గా మరియు కొరియోగ్రాఫర్ కూడా చూసి తనలోని కొత్త టాలెంట్ ని బయటపెట్టింది. ఇదంతా పక్కన పెడితే ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేది, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే, ఈమె ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. డ్యాన్స్ లో మొదటి నుండి మంచి టాలెంట్ ఉన్న ఈమె, తన డ్యాన్స్ ఆడిషన్స్ కోసం చేసిన వీడియోలను తన వెంటపెట్టుకొని ఎన్నో స్టూడియోస్ చుట్టూ అవకాశాల కోసం తిరిగేది. అలా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆమెకి ‘జాతి రత్నాలు’ చిత్రంలో ఛాన్స్ దక్కింది. అంతే కాదు ఈమె బాల్యం లో బాలీవుడ్ లో అనేక టీవీ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిందట.
రెండు మూడు బాలీవుడ్ సినిమాలలో కూడా ఆమె బాలనటించింది కానీ, ఆ చిత్రాలు ఆమెకి అనుకున్న స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. ఇక పెద్దయ్యాక ఆమె హీరోయిన్ గా మారి తన అదృష్టాన్ని పరీక్షించునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. టాలెంట్, అందం అన్ని ఉన్నప్పటికీ ఈమె పొడవుగా ఉండడం వల్ల సినిమాల్లో అవకాశాలు రావడం లేదని విశ్లేషకులు చెప్తున్న మాట. టాలీవుడ్ లో ఉన్న హీరోలందరికంటే ఈమెనే ఎక్కువ పొడవు ఉంటుంది. ప్రభాస్ పక్కన నటించినా కూడా ఈమె సెట్ అవ్వదు. అందుకే దర్శక నిర్మాతలు పెద్ద సినిమాల్లో ఈమెని మెయిన్ లీడ్ గా పెట్టి సినిమాలు తీసేందుకు ముందుకు రావడంలేదు.