Ram Charan RC 16
Ram Charan : ఈనెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan( పుట్టినరోజు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది అభిమానులు ఆయన పుట్టినరోజు ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. అయితే అందరి హీరోల అభిమానులు లాగానే , రామ్ చరణ్ అభిమానులు కూడా పుట్టినరోజుకి కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ని ఖరారు చేయలేదు కాబట్టి #RC16 పేరుతోనే సోషల్ మీడియా లో చలామణి అవుతుంది. అయితే డైరెక్టర్ బుచ్చి బాబు ఈ సినిమా కథని రాసుకుంటున్నప్పుడే ‘పెద్ది’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ టైటిల్ బయటకు లీక్ అయినప్పుడు అభిమానుల నుండి మొదట్లో నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ చిన్నగా ఆ టైటిల్ ని అలవాటు చేసుకున్నారు.
Also Read : గేమ్ చేంజర్’ కి రామ్ చరణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా..?
కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రామ్ చరణ్ ఆ టైటిల్ అసలు ఏమాత్రం నచ్చలేదట. సినిమా కంటెంట్ ని తెలిపే విధంగా, ఏదైనా పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేయండి, ఇలాంటివి వద్దు అని చెప్పాడట. దీంతో మూవీ టీం ఇప్పుడు ఆయన పుట్టినరోజుకి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేద్దామా వద్దా అనే ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. కానీ ఆరోజున ఈ సినిమా గురించి ఎదో ఒక అప్డేట్ కచ్చితంగా వస్తుందని మాత్రం అంటున్నారు. టైటిల్ ని అధికారికంగా ప్రకటించకుండా, #RC16 ట్యాగ్ తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజున కూడా ఇలాగే చేసారు. ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది
ఇక #RC16 విశేషాలకు వస్తే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రమని చెప్పొచ్చు. ఇందులో రామ్ చరణ్ అన్ని ఆటల్లోనూ గొప్ప ప్రావీణ్యత ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అద్దెకు ఆటలకు అవసరమైన వాళ్లకు ఆడుతూ ఉంటాడట. రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నటనకు స్కోప్ ఉన్న క్యారక్టర్ రామ్ చరణ్ కి ఈ సినిమా ద్వారా పడిందని అంటున్నారు. ఇందులో సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో రామ్ చరణ్ కి గురువు పాత్రలో కనిపించబోతున్నాడు. ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తో డీలాపడిన రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా కచ్చితంగా ఒక మంచి కిక్ ని ఇస్తుందని, రంగస్థలం తో మిస్ అయిన నేషనల్ అవార్డ్, ఈ సినిమాతో దక్కించుకుంటాడని అంటున్నారు విశ్లేషకులు.
Also Read : రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న తమిళ్ స్టార్ డైరెక్టర్..