Ola Electric Bike : ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రముఖ కంపెనీలతో సహా కొత్త కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో పాపులర్ అయిన కంపెనీ ఓలా. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దీనిని మించింది ప్రస్తుతం మార్కెట్లో లేదు. ఈ క్రమంలోనే కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల తన ఎలక్ట్రిక్ బైక్ ఓలా రోడ్‌స్టర్ X ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. చాలా మంది ఇప్పటికే దీనిని బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ ఆలస్యం కావచ్చు. దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
Also Read : లాంచ్ అయిన వెంటనే రికార్డు బుకింగ్స్ సాధించిన ఎలక్ట్రిక్ స్కూటర్
ఓలా తన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసినప్పుడు దాని డెలివరీ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని చెప్పింది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ డెలివరీ ఆలస్యం కావచ్చు.కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కూడా నిలిపేసింది. ఓలా ఎలక్ట్రిక్‌ను ఇటీవల ప్రభుత్వం తీవ్రంగా మందలించింది. కంపెనీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లను విక్రయించింది. కానీ అన్ని వాహనాలు సకాలంలో డిలివరీ కాలేదు. దీని కారణంగా కంపెనీ దగ్గర భారీ బకాయిలు ఉన్నాయి. కంపెనీ రోడ్‌స్టర్ డెలివరీ ఆలస్యం కావడానికి ఈ బకాయిలే ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతను రోజ్‌మెట్రా డిజిటల్ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహించింది. ఇటీవల, ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు, రిజిస్ట్రేషన్ డేటా మధ్య భారీ అసమతుల్యత కారణంగా రెండు కంపెనీలు విడిపోయాయి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా నిర్వహిస్తోంది. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.ఈ ఏడాది 2025, ఫిబ్రవరిలో ప్రభుత్వ రంగ వాహన రిజిస్ట్రేషన్ల పోర్టల్ ల ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652 నమోదు అయ్యాయి. అయితే, కంపెనీ మాత్రం ఏకంగా 25 వేల స్కూటర్లు, బైకులు విక్రయించినట్లు ప్రకటించి ఆశ్చర్య పరిచింది. మార్చి 20 నాటికి వాహన్ పోర్టల్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 11,781గా నమోదైంది.
కంపెనీ ప్రకటనకు, రిజిస్ట్రేషన్లకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. గాడివాడి వార్తల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లో బ్యాటరీ ప్యాక్ నుంచి థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వరకు సమస్యలు బయటపడ్డాయి. ఎలక్ట్రిక్ మోటారులో కూడా సమస్య ఉంది. ఈ కారణంగా కూడా ఓలా ఎలక్ట్రిక్ డెలివరీని ఆలస్యం చేయాలని యోచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ 3 వేరియంట్లలో రానుంది. రోడ్‌స్టర్ X (2.5 kWh), రోడ్‌స్టర్ X (3.5 kWh), రోడ్‌స్టర్ X (4.5 kWh) ధర రూ.74,999 నుంచి ప్రారంభమై రూ.95,999 వరకు ఉంటుంది.
Also Read : అట్లర్ ప్లాప్ గా హీరో స్ప్లెండర్, హోండా యాక్టీవా.. ఎలా అంటే ?