Balakrishna-Prabhas
Balakrishna-Prabhas : ఒకప్పుడు చిరంజీవి(Megatsar Chiranjeevi),బాలకృష్ణ(Nandamuri Balakrishna) సినిమాలు సంక్రాంతికి పోటీపడుతూ విడుదల అయ్యేవి. ఆరోజుల్లో ఎలా ఉండేది అంటే, సంక్రాంతి అంటే కోళ్ల పందాలు, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు సర్వసాధారణం అన్నట్టు ఉండేవి. ఎక్కవసార్లు మెగాస్టార్ చిరంజీవి నే గెలిచాడు కానీ, బాలయ్య గెలిచినప్పుడు మాత్రం రీ సౌండ్ మామూలు రేంజ్ లో రాలేదు. అప్పట్లో వీళ్లిద్దరి సినిమాలు పోటీకి వస్తున్నాయంటే, మిగిలిన హీరోలు మధ్యలో దూరడానికి సాహసం చేసేవారు కాదు. రెండుసార్లు వీళ్లిద్దరి పోటీ మధ్య మూడో సినిమా పోటీకి వచ్చింది. ఒకేసారి నరసింహ నాయుడు, దేవి పుత్రుడు, మృగరాజు సినిమాలు విడుదలయ్యాయి. వెంకటేష్ అంటే చిరంజీవి, బాలయ్య తో సరిసమానమైన స్టార్ కాబట్టి పోటీకి వచ్చాడు. కానీ అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చి హిట్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రభాస్ లాంటి యంగ్ హీరో ఈ హేమాహేమీల మధ్యలోకి వచ్చే సాహసం చేశాడు.
Also Read : తల్లి నగలు తాకట్టు..కష్టాల్లో ఉన్న యంగ్ హీరోకి ప్రభాస్ భరోసా!
ప్రభాస్ యంగ్ హీరో కాబట్టి, చిరంజీవి, బాలయ్య లాంటి సూపర్ స్టార్స్ ముందు నిలబడడం కష్టం అని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రమే వాళ్ళిద్దరి సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ సినిమానే వర్షం. అంజీ, లక్ష్మి నరసింహా సినిమాల మధ్య ఇది విడుదలైంది. అంజి చిత్రం ఫ్లాప్ కాగా, లక్ష్మి నరసింహా హిట్ అయ్యింది. ఇక వర్షం అయితే సెన్సేషనల్ హిట్ గా నిల్చి దాదాపుగా ఆరోజుల్లోనే 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. అలా ఇద్దరు సూపర్ స్టార్స్ సినిమాలతో గొడవ పడి ప్రభాస్(Rebel Star Prabhas) విజయం సాధించడం ఆరోజుల్లో ఒక సంచలనం. ఈ సినిమానే ప్రభాస్ కి మొట్టమొదటి సూపర్ హిట్. ఈ చిత్రం తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈరోజు ఆయన ఇండియాలోనే నెంబర్ 1 సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయం రేంజ్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ, అది కుదర్లేదు. గ్రాఫిక్స్ చాలా రీ వర్క్ చేయించే పరిస్థితులు ఉన్నందున దసరా వరకు ఈ చిత్రం విడుదల అయ్యే సూచనలు కనిపించడం లేదు. మరోపక్క ప్రభాస్ హను రాహ్హవపూడి తో సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నాడు.
Also Read : రజినీకాంత్ సిల్క్ స్మిత లో మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి..?