Ram Charan
Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ (Ram Charan) లాంటి నటుడు ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తు ముందుకు సాగుతూ ఉండడం విశేషం… రీసెంట్ గా ఆయన చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఆశించిన మేరకు సాధించకపోయినప్పటికి బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియాలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో రామ్ చరణ్ సైతం తనకంటూ ఒక భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకొని ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించాడు. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ఆయనలోని నటన ప్రతిభను బయటకు తీసి ఎలాంటి పాత్రలోనైనా సరే అలవోకాగా నటించగలిగే కెపాసిటీ తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. ఇక రామ్ చరణ్ తో ఇండియాలో ఉన్న దర్శకులందరు సినిమాలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది.
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
నిజానికి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్(Lokesh Kanaka Raj) సైతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే రామ్ చరణ్ తో సినిమా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
కాబట్టి ఆయన రామ్ చరణ్ తో ఎప్పుడు సినిమా చేస్తాడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘విక్రమ్ 2’ ప్రాజెక్ట్ ను తెరమీదకి తీసుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ కి ఇప్పటికే కథ చెప్పి మెప్పించిన లోకేష్ కనకరాజు ఆ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు…
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో క్రికెటర్ ధోని నటిస్తున్నాడా..?