Game Changer
Ram Charan : ఈమధ్య కాలం లో మన స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. ఒకప్పుడు అడ్వాన్స్ ఇస్తే కానీ డేట్స్ ఇవ్వని హీరోలు, ఇప్పుడు మాత్రం పెరుగుతున్న బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు ఇప్పటికే ఈ సిద్ధాంతం ని అనుసరిస్తున్నారు. రామ్ చరణ్(Global Star Ram Charan) కూడా ఇదే సిద్ధాంతం ని అనుసరిస్తున్నట్టు నేడు దిల్ రాజు మాటల్లో తెలిసింది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) ఈ సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) నిర్లక్ష్య ధోరణితో సినిమా తీయడం, బడ్జెట్ అనుకున్న దానికంటే డబుల్ అవ్వడమే అందుకు కారణం అని చెప్పొచ్చు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ‘గేమ్ చేంజర్’ నష్టాలను పూడ్చుకున్న దిల్ రాజు(Dil Raju), ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
Also Read : ‘దేవర’ కటౌట్ కి జపాన్ అమ్మాయిలు ప్రత్యేక పూజలు..ఇదేమి క్రేజ్ బాబోయ్!
మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎల్ 2: ఎంపురన్'(L2: Empuran) ఈ నెల 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో మలయాళం తో పాటు, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా నేడు ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో మోహన్ లాల్, డైరెక్టర్ పృథ్వీ రాజ్ తో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొన్నారు. ఈ సంబదర్భంగా విలేఖరులు దిల్ రాజు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈమధ్య కాలం లో హీరోలు రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో వాటాలు అడుగుతున్నారు అంట కదా నిజమేనా?’ అని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘అవును..ఈ సినిమాకు మోహన్ లాల్ గారు, పృథ్వీ రాజ్ గారు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. లాభాల్లో వాటాలు తీసుకుంటారు. రాజమౌళి కూడా ఇదే ఫార్ములాని అనుసరిస్తున్నారు కదా’ అని అంటాడు.
మరో రిపోర్టర్ దిల్ రాజు ని ప్రశ్న వేస్తూ ‘మీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ చేంజర్ కి కూడా ఇదే ఫార్ములా ని అనుసరించారా?’ అని అడిగితే, దానికి దిల్ రాజు అవును అని సమాధానం ఇచ్చాడు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అప్పట్లో రామ్ చరణ్ వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దిల్ రాజు నోటి నుండే లాభాల్లో వాటాలు ఫార్ములా తోనే ‘గేమ్ చేంజర్’ తెరకెక్కింది అని చెప్పడంతో, రామ్ చరణ్ ఈ సినిమాకు రెమ్యూనరేషనే తీసుకోలేదు అనేది స్పష్టమైంది. ఎందుకంటే ఈ చిత్రానికి దాదాపుగా వంద కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఈ రేంజ్ నష్టం ఉన్నప్పుడు వాటాలు ఏమొస్తాయి చెప్పండి!.
Also Read : ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీకి నిర్మాత..ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?