https://oktelugu.com/

చిరంజీవి సినిమాకు రామ్ చరణే సమస్యా ?

మెగా ఫ్యామిలీలో ఒక అలవాటుంది. అదేమిటంటే ఒక హీరో సినిమాలో ఇంకొకరు కాసేపు కనిపంచడం. ఇది అభిమానులకు ఉల్లాసాన్ని ఇవ్వడం కోసమే. ఫ్యామిలీలో ఒక హీరో తన సినిమాలో కాసేపు కనబడమని అడిగితే మరొక హీరో ఒప్పుకుని కనిపిస్తుంటారు. ఈ క్రేజీనెస్ చిరంజీవి, చరణ్ మధ్యన ఎక్కువగా ఉంటుంది. గతంలో చరణ్ చేసిన ‘మగధీర’ చిత్రంలో చిరంజీవి బంగారు కోడిపెట్ట అనే పాటలో ఎక్కువసేపు కనిపించిన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. అలాగే చిరు రీఎంట్రీ సినిమా ‘ఖైదీ […]

Written By:
  • admin
  • , Updated On : November 1, 2020 / 04:33 PM IST
    Follow us on


    మెగా ఫ్యామిలీలో ఒక అలవాటుంది. అదేమిటంటే ఒక హీరో సినిమాలో ఇంకొకరు కాసేపు కనిపంచడం. ఇది అభిమానులకు ఉల్లాసాన్ని ఇవ్వడం కోసమే. ఫ్యామిలీలో ఒక హీరో తన సినిమాలో కాసేపు కనబడమని అడిగితే మరొక హీరో ఒప్పుకుని కనిపిస్తుంటారు. ఈ క్రేజీనెస్ చిరంజీవి, చరణ్ మధ్యన ఎక్కువగా ఉంటుంది. గతంలో చరణ్ చేసిన ‘మగధీర’ చిత్రంలో చిరంజీవి బంగారు కోడిపెట్ట అనే పాటలో ఎక్కువసేపు కనిపించిన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. అలాగే చిరు రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెం 150’లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలో చరణ్ డ్యాన్స్ చేసి అలరించాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అలాగే ‘బ్రూస్లీ’ సినిమాలో అయితే మెగాస్టార్ ఏకంగా ఒక ఫైట్ కూడ చేసేశారు. అలా మూడు సార్లు కలిసి కనిపించిన తండ్రీకొడుకులు నాల్గవసారి కూడ అదే చేస్తున్నారు. చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో చరణ్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇది కథకు చాలా ముఖ్యమైన పాత్రట. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు. లాకా డౌన్ ముందు వరకు షూటింగ్ బాగానే జరిగింది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు వచ్చిన షూట్ రీస్టార్ట్ కావట్లేదు. ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటున్నారే తప్ప సెట్స్ మీదకి వెళ్లట్లేదు.

    Also Read: వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

    ఇన్నిరోజులు కోవిడ్ సమస్య మూలంగానే షూట్ స్టార్ట్ కావట్లేదని అనుకుంటుండగా ఇప్పుడు కొత్త వార్త ఒకటి బయటికొచ్చింది. అదే సినిమా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. సినిమా సెకండాఫ్లో కొన్ని మార్పులు ఉన్నాయని, అవే జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి లాక్ డౌన్ లేకపోయి ఉంటే అంతా పాత స్క్రిప్ట్ ప్రకారమే వెళ్లిపోయేది. కానీ లాక్ డౌన్ పడ్డాక మార్పుల ఆలోచన వచ్చిందట. అది కూడ కీలకమైన చరణ్ పాత్రలోనేనట. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తే త్వరలోనే చరణ్ జాయిన్ అవుతారు.

    Also Read: అల్లు అర్జున్ మ్యాజిక్.. ప్రభాస్ ను బీట్ చేశాడుగా?

    కాబట్టి ఈలోపు మార్పులు చేసుకుని వాటికి అనుగుణంగా చిత్రీకరణ జరిపితే చరణ్ వచ్చేనాటికి అంతా కుదురుకుంటుందని, పర్ఫెక్ట్ గా ఉంటుందని కొరటాల, చిరులు భావిస్తున్నారట. అందుకే మార్పులు చేసే పనిలో ఉన్నారట. ఒక్కసారి స్క్రిప్ట్ పక్కా అనుకున్నాక షూటింగ్ మొదలుపెడతారట.