వాల్మీకి బర్త్ డే.. వాళ్లపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు ఎంతకూ తగ్గట్లేదు. అప్పట్లో గాడ్సే పై, బాలక్రిష్ణపై సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన నాగబాబు తాజాగా మరోసారి తన ఆక్రోషం వెళ్లగక్కారు. ఇటీవల బీజేపీ, హిందుత్వంపై నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ దుమారం తగ్గకముందే మరో వివాదాస్పద అంశాన్ని టేకప్ చేస్తూ దుమారం రేపుతున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తాజాగా మరోసారి కులకుంపట్లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వాల్మీకి జయంతి సందర్భంగా […]

Written By: NARESH, Updated On : November 1, 2020 4:49 pm
Follow us on

మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు ఎంతకూ తగ్గట్లేదు. అప్పట్లో గాడ్సే పై, బాలక్రిష్ణపై సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన నాగబాబు తాజాగా మరోసారి తన ఆక్రోషం వెళ్లగక్కారు. ఇటీవల బీజేపీ, హిందుత్వంపై నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ దుమారం తగ్గకముందే మరో వివాదాస్పద అంశాన్ని టేకప్ చేస్తూ దుమారం రేపుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

తాజాగా మరోసారి కులకుంపట్లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ తనదైన శైలిలో నాగబాబు ట్వీట్ చేశారు.

Also Read: ఆర్ఆర్ఆర్ రచ్చ.. రాజమౌళిపై బండి సంజయ్ ఫైర్

నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గద్దలకొండ గణేష్’ మూవీకి మొదట పెట్టిన పేరు ‘వాల్మీకి’నే. అయితే ఆ సామాజికవర్గం వారు గొడవ చేయడం.. వివాదం చెలరేగడంతో చివరిక్షణంలో పేరును మార్చారు. తాజాగా అదే విషయాన్ని గుర్తు చేస్తూ నాగబాబు ఈ సెటైరికల్ కామెంట్ పెట్టినట్టు చర్చ జరుగుతోంది.

Also Read: అల్లు అర్జున్ మ్యాజిక్.. ప్రభాస్ ను బీట్ చేశాడుగా?

”ఆ రోజు ‘వాల్మీకి’ అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా. వాళ్ళకి మరి ఈ రోజు వాల్మీకి జయంతి అని గుర్తుండే ఉంటుంది. ఏదైతేనేం.. హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారు. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు. రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదాలు” అని నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.