https://oktelugu.com/

విజయవాడపై కొత్త ప్రతిపాదన ఇదీ

గత   టీడీపీ ప్రభుత్వం  అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ సందర్భంగా విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించింది. కేంద్రంతో మాట్లాడి విశాఖను రైల్వేజోన్‌గా ప్రకటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియడం లేదు. అయితే.. ఇప్పుడు తాజాగా జగన్‌ ప్రభుత్వం అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానులను ప్రకటించారు. అందులో భాగంగా ముఖ్యంగా విశాఖను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గానూ ప్రకటించేసింది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 04:42 PM IST
    Follow us on

    గత   టీడీపీ ప్రభుత్వం  అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ సందర్భంగా విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించింది. కేంద్రంతో మాట్లాడి విశాఖను రైల్వేజోన్‌గా ప్రకటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియడం లేదు. అయితే.. ఇప్పుడు తాజాగా జగన్‌ ప్రభుత్వం అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానులను ప్రకటించారు. అందులో భాగంగా ముఖ్యంగా విశాఖను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గానూ ప్రకటించేసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అయితే.. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అవుతున్న విశాఖలో రైల్వే జోన్‌ ఎందుకని.. ఆ జోన్‌ను విజయవాడకు మార్చాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. విజయవాడ రైల్వే జోన్ అంశం మొదటి నుంచీ రాజకీయ పరంగా డిమాండ్‌ ఉంది. గతంలో ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంటయ్యారు. విశాఖకు రైల్వేజోన్ ఉండాల్సిందేనని ఆయన అన్నారు.

    Also Read: దేశంలోనే ఏపీకి అత్యంత అన్యాయం: జగన్

    విజయవాడ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలా బాగుంటుందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా. ప్రస్తుతం విశాఖ తూర్పు కోస్తా రైల్వేజోన్‌ పరిధిలో ఉంది. విజయవాడ డివిజన్‌ పరిధి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి స్టేషన్‌ వరకు ఉంది. తడ వరకు విజయవాడ డివిజన్‌ సరిహద్దు ఉంది. ఈ కారణంగా రైల్వేజోన్ విజయవాడలో ఉంటే మంచిదన్న అభిప్రాయమే వినిపిస్తోంది. అతిపెద్ద జంక్షన్‌గా ఉన్న విజయవాడ కేంద్రంగానే నూతన జోన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగానే ఉంది.

    Also Read: ప్రైవేట్ పాఠశాలలకు జగన్ సర్కార్ షాక్.. టీసీ లేకుండానే…?

    అయితే.. ఇదే అంశంపై రాజకీయ పార్టీల నేతలు కూడా ఎత్తుకుంటే ప్రాధాన్యత దక్కుతుంది. దీంతో ప్రభుత్వం కూడా అంగీకరించి విజయవాడలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేసే అవకాశాలూ లేకపోలేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన కూడా ఎలా ఉందో చూడాల్సిందే.