Ram Charan – Prabhas Multistarrer: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపుని తెచ్చుకున్న స్టార్ హీరోలు ఎవరు అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు ప్రభాస్ మరియు రామ్ చరణ్..బాహుబలి సిరీస్ తో ప్రభాస్..#RRR సినిమాతో రామ్ చరణ్ ఇండియా మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్స్ కొట్టి టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసేలా చేసారు..అలాంటి ఈ ఇద్దరి హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు..త్వరలోనే ఈ సెన్సషనల్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారట ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఆయన దగ్గర ఒక పాన్ వరల్డ్ సబ్జెక్టు ఉందని..ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అలాంటి సబ్జెక్టు తో ఒక్క సినిమా కూడా రాలేదని భీమ్లా నాయక్ చిత్రం నిర్మాత సూర్య దేవర నాగవంశీ చెప్పుకొచ్చాడు..ఈ ప్రాజెక్ట్ ని ప్రభాస్ మరియు రామ్ చరణ్ లను హీరోగా పెట్టి తీయాలనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కోరికట.

ప్రభాస్ మరియు రామ్ చరణ్ ఇప్పటి వరుకు టాలీవుడ్ లో దాదాపుగా అందరి టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసారు కానీ త్రివిక్రమ్ తో చెయ్యలేదు..ఈ ఇద్దరి హీరోల అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు తమ హీరోలను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో చూస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు..వారి ఎదురు చూపులకు మొత్తానికి అతి త్వరలోనే తెరపడబోతుందని తెలుస్తుంది..ఇటీవల కాలం లో మల్టీస్టార్ర్ర్ సినిమాలు సర్వసాధారణం అయ్యిపోయేసరికి ప్రభాస్-రామ్ చరణ్ మల్టీస్టార్ర్ర్ సినిమా కూడా గట్టిగా తల్చుకుంటే పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు విశ్లేషకులు..పైగా రామ్ చరణ్ – ప్రభాస్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు..రియల్ లైఫ్ లో స్నేహితులు కలిసి సినిమా తీస్తే ఆ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా తో చూసాము..రేపు రామ్ చరణ్ – ప్రభాస్ మల్టీస్టార్ర్ర్ కూడా అదే రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు..మొన్నీమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది..ఈ సినిమా పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ డ్రీం ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.