https://oktelugu.com/

‘ఆచార్య’ సెట్ లో రామ్ చరణ్.. చెకింగ్ కోసమే!

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. కాగా రామ్‌చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్నారాయన. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్న ‘ఆచార్య’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అయితే ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్న రామ్‌చరణ్‌, ‘ఆచార్య’ కోసం ఫిబ్రవరిలో షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. అయితే నిర్మాతగా మాత్రం ఆయన ‘ఆచార్య’ పనుల్ని ఎప్పట్నుంచో చక్కబెడుతున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 11:11 AM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’.
    కాగా రామ్‌చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్నారాయన. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్న ‘ఆచార్య’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అయితే ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్న రామ్‌చరణ్‌, ‘ఆచార్య’ కోసం ఫిబ్రవరిలో షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. అయితే నిర్మాతగా మాత్రం ఆయన ‘ఆచార్య’ పనుల్ని ఎప్పట్నుంచో చక్కబెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఊరి సెట్‌ని చరణ్‌ పరిశీలించారు.

    Also Read: త్రిపుల్ ధమాకా… పవన్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్!

    దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఫిబ్రవరిలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట.

    Also Read: కోటప్ప కొండలో బాలయ్య షూటింగ్ !

    కాగా సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. రేపటి నుండి ఆ సెట్ లో మెగాస్టార్ పై సాంగ్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు జానీ మాస్టర్ సాంగ్స్ ను కంపోజ్ చేయనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్