https://oktelugu.com/

వైసీపీలో పెరుగుతున్న కుమ్ములాటలు

వైసీపీ.. టీడీపీ రెండూ ప్రాంతీయ పార్టీలే. 18 నెలల వరకు టీడీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ఇప్పటి పాలనను పోల్చితే వైసీపీ కంటే టీడీపీయే బెటర్‌‌ అని అనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న క్రమశిక్షణ వైసీపీలో కనిపించడం లేదు. లెక్కకు మించిన నేతలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కానీ ఎక్కడా విభేదాలను పరిష్కరించే ప్రయత్నాలు అధిష్టానం చేయకపోవడంతో వైసీపీలో రోజురోజుకూ విభేదాలు సైతం ముదురుతున్నాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 6:05 pm
    Follow us on

    YSRCP

    వైసీపీ.. టీడీపీ రెండూ ప్రాంతీయ పార్టీలే. 18 నెలల వరకు టీడీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ఇప్పటి పాలనను పోల్చితే వైసీపీ కంటే టీడీపీయే బెటర్‌‌ అని అనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న క్రమశిక్షణ వైసీపీలో కనిపించడం లేదు. లెక్కకు మించిన నేతలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కానీ ఎక్కడా విభేదాలను పరిష్కరించే ప్రయత్నాలు అధిష్టానం చేయకపోవడంతో వైసీపీలో రోజురోజుకూ విభేదాలు సైతం ముదురుతున్నాయి.

    Also Read: మీరు వ్యాపారాలు వదిలేయండి.. నేను సినిమాలు వదిలేస్తా: పవన్

    సొంత పార్టీ నేతలే పోలీస్‌ స్టేషన్ల వరకూ వెళ్తుండడంతో ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత భావన వస్తోంది. చంద్రబాబు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ.. ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా విభేదాలు తలెత్తలేదు. ఎన్నికలకు ముందు కొంత విభేదాలు టీడీపీలో కన్పించాయి. కానీ.. మూడేళ్ల పాటు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సమన్వయంతోనే పనిచేశారు. ఇక వైసీపీ విషయానికొస్తే కేవలం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే విభేదాలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. మరోవైపు.. వీరి పట్ల హైకమాండ్‌ కూడా సాదాసీదా వైఖరితో ఉంటోంది.

    Also Read: తిరుపతిలో గెలిచేందుకు పార్టీల ఆరాటం

    వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు పార్టీపైనా, ప్రభుత్వంపైనా నిత్యం విమర్శలు చేస్తున్నా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది మిగిలిన నియోజకవర్గాలలో నేతలకు అలుసుగా మారినట్లుంది. అందుకే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల వరకూ తమ వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తమ పార్టీలోని వైరి వర్గంతో ఢీ కొడుతున్నారు. అంబటి రాంబాబు విషయమే తీసుకుంటే సొంత పార్టీ నేతలే ఆయనపై హైకోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం. దీనికితోడు ఏ నియోజకవర్గంలో చూసినా ఆధిపత్య పోరు కనిపిస్తూనే ఉంది

    పెద్ద ఎత్తున పదవులు భర్తీ చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేస్తున్నా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణంగా స్పష్టమవుతోంది. పదవులపై నమ్మకం పెట్టుకున్న నేతలు ఎక్కువ కావడం కూడా రచ్చ కావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. విభేదాలను పరిష్కరించడానికి సీనియర్ నేతలను జగన్ నియమించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతసేపూ జగన్‌ ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టిసారిస్తున్నా.. పార్టీని పట్టించుకుంటేనే బాగుంటుందనే అభిప్రాయం వెల్లడవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్