ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. ఈ తప్పు చేస్తే డబ్బులు కట్..?

మనలో చాలామంది తరచూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పుల వల్ల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏటీఎం లావాదేవీలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అకౌంట్ లో డబ్బులను నష్టపోతూ ఉంటారు. ట్రాన్సాక్షన్ ఫెయిల్‌ చార్జీల గురించి బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. Also Read: గూగుల్ పే యూజర్లకు బంపర్ ఆఫర్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై […]

Written By: Navya, Updated On : December 29, 2020 2:41 pm
Follow us on


మనలో చాలామంది తరచూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పుల వల్ల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏటీఎం లావాదేవీలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అకౌంట్ లో డబ్బులను నష్టపోతూ ఉంటారు. ట్రాన్సాక్షన్ ఫెయిల్‌ చార్జీల గురించి బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.

Also Read: గూగుల్ పే యూజర్లకు బంపర్ ఆఫర్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై భారీ తగ్గింపు!

చాలామందికి బ్యాంక్ అకౌంట్ లో ఎంత మొత్తం ఉందనే విషయం అవగాహన ఉండదు. అందువల్ల ఏటీఎంకు వెళ్లిన సమయంలో అమౌంట్ ఎంటర్ చేసి తగినంత బ్యాలన్స్ లేకపోయినా నగదు విత్ డ్రా చేసే ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో లావాదేవీ ఫెయిల్ అవుతుంది. డబ్బులు లేకపోయినా ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసే ప్రయత్నం చేస్తే బ్యాంకులు ఛార్జీలను వసూలు చేస్తాయి.

Also Read: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. ఆ ఆఫర్లను నమ్మొద్దు..?

అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు లావాదేవీలపై అవగాహనను ఏర్పరచుకుంటే మంచిది. అకౌంట్ లో ఎంత బ్యాలన్స్ ఉందనే అవగాహన లేకపోతే మొదట బ్యాలన్స్ చెక్ చేసుకుని ఆ తరువాత డబ్బులను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నం చేస్తే మంచిది. దేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఒక్కో బ్యాంకు ట్రాన్సాక్షన్ ఫెయిల్‌ చార్జీల విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోంది. కొన్ని బ్యాంకులు లావాదేవీ ఫెయిల్ అయితే 20 రూపాయలు వసూలు చేస్తుండగా మరికొన్ని బ్యాంకులు 25 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఛార్జీల రూపంలో వసూలు చేస్తుండటం గమనార్హం.