https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ పెళ్లి ఆ అమ్మాయితోనే అంటూ ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో అధికారికంగా ప్రకటించిన రామ్ చరణ్!

ప్రభాస్ తో ఫోన్ కాల్ సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, వికాస్ లు షోలోకి వస్తారు. వాళ్ళతో కూడా చరణ్ కాసేపు సరదాగా మాట్లాడిన మాటలు చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట.

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2025 / 07:41 PM IST

    Prabhas - Ram Charan

    Follow us on

    Prabhas : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ప్రభాస్ తప్ప మనకి ఎవరూ కనిపించరు. శర్వానంద్, నితిన్, రానా దగ్గుబాటి వంటి హీరోలు కూడా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం నాలుగు పదుల వయస్సు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అభిమానులకు కాస్త అసహనానికి గురి చేస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ఎవరైనా అడిగితే షూటింగ్స్ నాన్ స్టాప్ గా ఉంటున్నాయి. ఇలాంటి సమయం లో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చేసుకోవడం లేదు అని ఒక ఇంటర్వ్యూ లో అన్నాడు. ఇది కేవలం ఆయన తప్పించుకోవడానికి చెప్తున్నాడని అందరూ అనుకున్నారు కానీ, అదే నిజమని ప్రభాస్ స్నేహితుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పాల్గొన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో పాల్గొన్నప్పుడే తెలిసిందే. ఆయన ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో ఒక హింట్ ఇచ్చేసాడు.

    అందరూ అనుకుంటున్నట్టు ప్రభాస్ హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడం లేదు. ఒకప్పుడు అనుష్క తో పెళ్లి అన్నారు, ఆ తర్వాత బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ తో పెళ్లి అన్నారు, చివరికి నాగ బాబు కూతురు నిహారిక తో కూడా పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి. హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ తన సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి పరోక్షంగా ఇస్తే, దానిని ప్రభాస్ అభిమానులు తమ హీరో గురించే అని అనుకొని, వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారేమో అని ప్రచారం మొదలు పెట్టారు. అయితే అవన్నీ ఫేక్ అని రామ్ చరణ్ మాటలతో మరోసారి నిరూపితమైంది. రీసెంట్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ప్రభాస్ కి ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ కి ముందు ఆయన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని బాలయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, భీమవరం లోని గణపవరానికి చెందిన ఒక అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

    అమ్మాయి పేరు ఏమిటి?, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అనే వివరాలు మాత్రం చెప్పలేదు. పెళ్లి ఆమెతో ఖరారు అయ్యింది అనే విషయం మాత్రం చెప్పేసాడు. దీంతో ప్రభాస్ అభిమానులు మా హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ ఇంకా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవ్వలేదు. కేవలం మొదటి భాగం మాతరమే ప్రస్తుతం ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అవుతుంది. రెండవ భాగం జనవరి 14 న స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభం లోనే ఈ సంబాషణ, అదే విధంగా ప్రభాస్ తో ఫోన్ కాల్ సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, వికాస్ లు షోలోకి వస్తారు. వాళ్ళతో కూడా చరణ్ కాసేపు సరదాగా మాట్లాడిన మాటలు చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట.