Roja : మాజీ మంత్రి రోజా( ex minister Roja ) విషయంలో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? ఆ పార్టీ శ్రేణులకు అది మింగుడు పడడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి వైసీపీ రకరకాలుగా విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా విరుచుకుపడుతున్నారు. ఆమె ఏకంగా సీఎం చంద్రబాబు తో ( Chandrababu)పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు. వారిద్దరిని తప్పుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో ఫైర్ బ్రాండ్లంతా పక్కకు వెళ్లిపోయారు. రకరకాల కారణాలతో సైలెంట్ అయ్యారు. కానీ రోజా మాత్రం ఇంకా తనలో ఉన్న ఫైర్ బయట పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. అయితే ఆమె విషయంలో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతోనే.. ఆమె రెచ్చిపోతున్నారని టిడిపి శ్రేణులు తప్పు పడుతున్నారు. ఆమె విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని హై కమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు టిడిపి అనుకూల మీడియా సైతం అదే అభిప్రాయంతో ఉంది.
* ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా తిరుపతిలో( Tirupati) అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) సైతం తప్పుపడుతున్నారు. కానీ ఇప్పుడు రోజా మీడియా ముందుకు వచ్చి అదే పనిగా సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే టిడిపి కూటమి చాలా నేర్చుకోవాలన్న భావన వ్యక్తం అవుతోంది. ఇదే మాజీ మంత్రి రోజా టీటీడీలో బ్రేక్ దర్శనాల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలతో సహా విజిలెన్స్ నివేదిక రెడీగా ఉంది. దానికి తోడు ఆమె నిర్వహించిన క్రీడా శాఖలు ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరిట దోపిడీ పర్వం నడిచింది. అయితే ఇన్ని ఆధారాలు ఉన్నా రోజా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే దానికి టిడిపి కూటమి ఉదాసీనత కారణం. మహిళా నేత కావడంతో తన జోలికి రారన్న ధీమా రోజా లో ఉంది.
* రోజా వ్యవహారం గుర్తుంది కదా
అయితే ఒక్క మాట నిజం. వైసీపీ నేతగానే కాకుండా.. మంత్రిగా రోజా( RK Roja ) వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరికి గుర్తు. ముఖ్యంగా జనసేన నేతలకు ఆమె చుక్కలు చూపించారు. తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ను( Kiran Royal ) వెంటాడారు. పలుమార్లు అరెస్టు చేయించారు కూడా. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాను జైల్లో పెట్టిస్తానని కిరణ్ రాయల్ శపథం కూడా చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోంది. కానీ ఆమెపై ఇంతవరకు చర్యలు లేవు. అందుకే ఆమె సందు దొరికితే చాలు మీడియా ముందుకు వచ్చి తన టంగ్ పవర్ చూపిస్తున్నారు. పాత భాషను ప్రయోగిస్తున్నారు. ఆమె అలా మాట్లాడడానికి ముమ్మాటికి టిడిపి కూటమి మంచితనమే కారణం.
* ఎంత ప్రతిపక్షమైతే
ప్రతిపక్ష నేతగా ఆమెకు ప్రశ్నించే అధికారం ఉంది. దానిని ఎవరు కాదనలేరు కూడా. కానీ ఇలా బరితెగించి చంద్రబాబు( Chandrababu) చేసిన హత్యలంటూ మాట్లాడేందుకు వెనుకడుగు వేయకపోవడం.. ఆసుపత్రిలో హంగామా చేసిన కేసులు పెట్టకపోవడం చూస్తుంటే.. ఇది ముమ్మాటికీ ఉదాసీనతే. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే.. ఎక్కడెక్కడో తలదాచుకుంటున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు మళ్లీ తెరపైకి వస్తారు. పాత రోజులు చూపిస్తారు. మరి తేల్చుకోవాల్సింది కూటమి ప్రభుత్వమే.