https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ ని రక్షించుకున్న అభిమానులు.. నాంపల్లి హై కోర్టు సంచలన తీర్పు..పోలీసులకు కీలక ఆదేశాలు!

పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం తో పాటు ఆయన కొరటాల శివతో ఒక సినిమా, సందీప్ వంగ తో మరో సినిమా చేయడానికి సంతకాలు చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 07:56 PM IST

    Allu Arjun

    Follow us on

    సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అభిమానులు నెల రోజుల నుండి తమ హీరోకి మధ్యంతర బెయిల్ ఎక్కడ రద్దు చేస్తారో, అసలు రెగ్యులర్ బెయిల్ ని పోలీసులు రానిస్తారా లేదా అని టెన్షన్ పడుతూ, కనీసం ‘పుష్ప 2 ‘ రికార్డ్స్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. ఎట్టకేలకు విచారణ లో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తో అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోర్టు అల్లు అర్జున్ ని రెండు నెలల పాటు ఉదయం 10 గంటల నుండి ఒంటి గంటలోపు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు గత ఆదివారం కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేసారు.

    అయితే ఈ విషయం పబ్లిక్ గా తెలియడంతో గత ఆదివారం అభిమానులు వేల సంఖ్య తో చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని చూసేందుకు వచ్చారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరం నెలకొంది. పోలీసులకు వాళ్ళను కంట్రోల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతీ వారం ఇలాగే ఉంటే చాలా కష్టం అయిపోతుందని, మళ్ళీ ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే తానే బాధ్యత వహించే పరిస్థితి వస్తుందని, ఈ విషయంపై కోర్టు వారు తగిన తీర్పు ఇవ్వాలని అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు లో పిటీషన్ ని వేసాడు. దీనిని సమర్దించిన కోర్టు అల్లు అర్జున్ ని మినహాయిస్తూ పోలీస్ స్టేషన్ కి ఆయన రావాల్సిన అవసరం లేదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అల్లు అర్జున్ కి కాస్త ఊరట లభించినట్టు అయ్యింది. ఇది కేవలం ఆయన అభిమానుల వల్లే సాధ్యపడింది అని చెప్పొచ్చు.

    ఎందుకంటే ఆయన వెంట అభిమానులు వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కి వస్తుండడం వల్లే కదా, పోలీసులు దీనిని పరిగణలోకి తీసుకొని అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కోసం తనని తాను తయారు చేసుకుంటున్నాడు. ఇప్పటికే లుక్ మొత్తాన్ని పూర్తిగా మార్చేయడం మనమంతా గమనించొచ్చు. సంక్రాంతికి ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం తో పాటు ఆయన కొరటాల శివతో ఒక సినిమా, సందీప్ వంగ తో మరో సినిమా చేయడానికి సంతకాలు చేసాడు.