spot_img
Homeఎంటర్టైన్మెంట్చరణ్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఫిక్స్ !

చరణ్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఫిక్స్ !

Ram Charan Anil Ravipudi
డైలాగ్ రైటర్ గా సంవత్సరాలు పని చేసినా అనిల్ రావిపూడికి స్టార్ డమ్ రాలేదు. కానీ, డైరెక్టర్ అయ్యాక వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మొత్తానికి స్టార్ హీరోల హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు అనిల్. కాగా రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఇటీవల అనిల్ రావిపూడిని కలిశారట. ఆయనతో కథ విషయమై సంప్రదింపులు జరిపారట. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి కానున్న నేపథ్యంలో రామ్‌చరణ్ తన తర్వాతి సినిమా కోసం కథలు వింటున్నాడట.

Also Read: ప్రభాస్ కి డేట్స్ ఇవ్వని హాట్ బ్యూటీ !

కాగా అందులో భాగంగానే చెర్రీకి అనిల్ ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో అనిల్‌తో పనిచేసేందుకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కలయికలో మొత్తానికి త్వరలోనే ఓ సినిమా రాబోతుంది అన్నమాట. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఎదురేలేకుండా పోయింది. కష్టకాలంలో ఉన్న కళ్యాణ్ రామ్ కి పటాస్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందించాడు అనిల్.

Also Read: డైరెక్టర్ ను పెళ్లాడబోతున్న హీరోయిన్ !

ఆ తరువాత మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ లోనే రేయ్ లాంటి భారీ డిజాస్టర్ అందుకున్న టైంలో ‘సుప్రీమ్’తో మంచి కమర్షియల్ మూవీ ఇచ్చి తేజ్ కెరీర్ కే మంచి ఊపు తెచ్చాడు. తన మూడో చిత్రం ‘రాజా ది గ్రేట్’. రవితేజ్ ను బ్లైండ్ క్యారెక్టర్ లో చూపించి హిట్ కొట్టాడు. తన సినిమాల్లో ఎలాంటి గొప్ప కథ తీసుకోకుండానే.. కేవలం తన శైలి కామెడీ క్యారెక్టరైజేషన్స్ తో, కామెడీ సీన్స్ తోనే సినిమాని హిట్ చెయ్యటం అంటే నిజంగా అనిల్ రావిపూడికే సాధ్యం అనుకుంటా. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’తో అలాగే ఎఫ్ 2తో సూపర్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఎఫ్ 3 చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper