
హాట్ బ్యూటీ దిశా పటానికి ఓ అద్భుతమైన అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపొయింది. కేజీఎఫ్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే పాన్ ఇండియా సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ దిశా పటానినే. ప్రభాస్ సరసన ఈ భామ అయితే బాగుంటుంది అని భావించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అమ్మడికి మొదట కథను కూడా వినిపించాడు. కథ విన్నాక సినిమా చేస్తానని చెప్పిన ఈ బ్యూటీ, ఆ తరువాత సైలెంట్ అయిపొయింది. కారణం, ఈ బాలీవుడ్ భామ ఇప్పటికిప్పుడు 60 రోజుల పాటు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు.
Also Read: నీ ఎనర్జీ ఆరని మంట – నాగబాబు !
కాగా ప్రశాంత్ 60 రోజుల పాటు డేట్స్ ఇవ్వాలని అడిగాడట. దాంతో అలా డేట్స్ ఇవ్వడం కష్టం అని చెప్పిందట. అందుకే ఆమెని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇద్దరు సౌత్ ఇండియన్ హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నారని, ప్రియాంక అరుళ్ మోహన్ దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ విషయం పై ఫుల్ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఇక ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలోనే మొదలు కానుంది. స్పీడ్ గా సినిమాని పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read: బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ హీరో !
ఇక దిశా పటాని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో చిత్రం షూటింగ్ లో ఉంది. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. రానున్న ఐదు నెలలు మొత్తం ప్రభాస్ సలార్ కోసమే కేటాయించనున్నాడు. అలానే డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారు. అందుకే స్టార్ హీరోయిన్ ను తీసుకోవడం లేదు. అన్నట్టు ఈ మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్