Ram Charan-Hrithik Roshan Multi-starrer: టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు మాములుగా లేదు అనే చెప్పాలి..#RRR సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎవ్వరు అందుకొని స్థాయికి వెళ్ళిపోయింది..పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు చరణ్ తో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారు..ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా సాగుతుంది..ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తి అయిపోయిందట..ప్రస్తుతం హైదరాబాద్ లో రామ్ చరణ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ని భారీ లెవెల్ లో తీస్తున్నారట..ఈ ఇంట్రడక్షన్ సన్నివేశం #RRR లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ని తలదన్నేలా ఉంటుందట..నిర్మాత దిల్ రాజు కి ఇది 50 వ సినిమా అవ్వడం..అందులోనూ ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడం తో ఖర్చుకు ఏ మాత్రం కూడా వెనకాడడం లేదట..రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాకి సిటిజెన్ లేదా సర్కారోడు అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read: Anushka Shetty: ‘వేశ్య’ గా మారడం అనుష్కకి ఇష్టమట.. కారణం అదే
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు రామ్ చరణ్ కి సంబందించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి వైరల్ గా మారింది..అదేమిటి అంటే శంకర్ గారి డ్రీం ప్రాజెక్ట్ అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ సినిమా తియ్యడమే అనే విషయం మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సినిమాని షారుక్ ఖాన్ తో భారీ లెవెల్ లో తీద్దాం అనుకున్నారు..కానీ ఎందుకో కుదర్లేదు..అయితే ఇప్పుడు ఈ సినిమాని రామ్ చరణ్ మరియు హృతిక్ రోషన్ మల్టీస్టార్ర్ర్ గా శంకర్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట..ఈ విషయం పై రామ్ చరణ్ తో శంకర్ ఇది వరకే చర్చలు కూడా చేసినట్టు తెలుస్తుంది..ఇందుకు రామ్ చరణ్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం..కానీ ఈ సినిమాకి వచ్చిన చిక్కు ఏమిటి అంటే బడ్జెట్ హద్దులు దాటి పోవడమే..సుమారు వెయ్యి కోట్ల రూపాయిల వరుకు బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది..ఇంత భారీ మొత్తం ఒక్క దర్శకుడు పెట్టడం అసాధ్యం..ప్రతి ఇండస్ట్రీ లో ప్రముఖ టాప్ నిర్మాత ని పట్టుకొని చెయ్యాలి..మరి శంకర్ ఎలా చేస్తాడో చూడాలి..అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ అంటే ఇది వరకే మనం ‘అక్వమ్యాన్’ అనే సినిమాని చూసాము కదా..అలా ఉంటుంది అన్నమాట..పైగా రామ్ చరణ్ – హృతిక్ రోషన్ లాంటి క్రేజీ స్టార్ హీరోలతో ప్లాన్ చెయ్యడం వల్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాలీవుడ్ తో పోటీ రేంజ్ కి ఈ సినిమా మన స్టాండర్డ్స్ ని సెట్ చేస్తుంది అని చెప్పొచ్చు..చూడాలి మరి భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాలుస్తుందా లేదా అనేది.

Also Read: India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమికి కారణాలు ఇవే
[…] Also Read: Ram Charan-Hrithik Roshan Multi-Starrer: పాన్ ఇండియా డైరెక్టర్… […]