MP Raghuramakrishna Raju: ఏపీలో ఎంపీ రఘురామక్రిష్ణంరాజు విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. నివాసముండేది తెలంగాణాలో. దీంతో ఆయన విషయంలో జరుగుతున్న రాద్ధాంతం ఇటు ఏపీ, అటు తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కట్లకు గురిచేస్తోంది. మీడియాకు సైతం ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియక సైలెంట్ అవుతోంది. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన రఘురామరాజు గెలుపొందారు. అయితే వైసీపీ అధిష్టానంతో ఆయన ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. రాజకీయ విభేదాలు రావడంతో ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ విధానాలను తప్పుపట్టడమే కాకుండా నిలదీస్తున్నారు. మీడియా సమావేశాలు నిర్వహించి మరీ ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక మీడియాగా ముద్రపడిన పత్రికలు, చానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మిగిలారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడానికి వైసీపీ అధిష్టానం చేయని ప్రయత్నం లేదు. పలుమారు లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు వినతులిచ్చారు. లేఖాస్త్రాలు సంధించారు. కానీ నిబంధనల ప్రకారం ఆయనపై సస్పెన్షన్ వేటు కుదరని పనిగా లోక్ సభ స్పీకర్ ప్రకటించారు. అలాగని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన మరింత స్వతంత్రంగా వ్యవహరించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారన్న భావన అధిష్టానంలో ఉంది. దీంతో రఘురామ, వైసీపీ ప్రభుత్వం మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. రఘురామను సొంత నియోజకవర్గం నరసాపురంలో అడుగు పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది. అటు రఘురామ కూడా తాను వైసీపీ ఎంపీనట్టు చెప్పుకుంటూ తన విమర్శల జడివానను కొనసాగిస్తున్నారు.

నాడు సీఐడీ కస్టడీలో అలా..
అయితే రఘురామను కట్టడి చేయాలన్న ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. ఆయనపై సీఐడీ కేసును నమోదుచేయించింది. హైదరాబాద్ లో నివాసముంటున్న రఘురామరాజును అక్కడి తెలంగాణా పోలీసుల సాయంతో సీఐడీ తన కస్టడీలో తెచ్చుకోగలిగింది. కేసు విచారణలో భాగంగా ఏపీలోని ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చింది. అయితే వెళ్లేటప్పుడు బాగానే ఉన్న రఘురామరాజు సీఐడీ కార్యాలయం నుంచి వచ్చేటప్పుడు మాత్రం గాయాలతో కనిపించారు. తనపై సీఐడీ అధికారులు చేయి చేసుకున్నారని రఘురామరాజు అటు లోక్ సభ తో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. అటు మీడియా కూడా ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడింది. ఏపీ మీడియాలో ప్రభుత్వ అనుకూలమైన మీడియా ఒకలా.. వ్యతిరేక మీడియా మరోలా స్పందించింది. కానీ నేషనల్ మీడియా మాత్రం ఒక ఎంపీ పై జరిగిన భౌతిక దాడిని సీరియస్ గా పరిగణించింది. కానీ అటు తరువాత ఈ అంశం కొన్నాళ్లుగా మరుగున పడిపోయింది. కానీ రఘురామరాజు మాత్రం తన శైలి మార్చుకోలేదు. అందివచ్చిన అన్ని వేదికల వద్ద తన ప్రతాపాన్ని వైసీపీ ప్రభుత్వంపై చూపుతున్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు ఆ జాడ్యం ఎక్కువైందట
నేడు కానిస్టేబుల్ పై దాడి ఇలా..

ఇటువంటి పరిస్థితుల్లో రఘురామరాజు సొంత నియోజకవర్గం భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యత ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ రఘురామరాజుదే. విగ్రహాన్ని ఏర్పాటు చేసింది తన సొంత సామాజికవర్గమైన క్షత్రియ సమాజమే. కానీ ఏపీ సర్కారు మాత్రం రఘురామరాజు కార్యక్రమానికి రాకుండా అడుగడుగునా అడ్డుపడింది. వివిధ కారణాలు చూపుతూ రఘురామరాజును దూరం పెట్టింది. ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపంతో ఉన్న రఘురామరాజు మరో ఘటనలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో రెక్కీ నిర్వహిస్తున్నారని ఏపీ పోలీస్ నిఘా విభాగానికి చెందిన కానిస్టేబుల్ ను ఎంపీ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తెలంగాణా పోలీసులకు అప్పగించారు. అయితే తనను రెండు గంటల పాటు చిత్రవధ చేశారని.. దారుణంగా కొట్టారంటూ సదరు కానిస్టేబుల్ అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఏ1 ముద్దాయిగా రఘురామరాజు, ఏ2గా ఆయన కుమారుడు భరత్, భద్రతా సిబ్బందిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఘటనపై కూడా ఎలా ముందుకెళ్లాలో మీడియాకు తెలియడం లేదు. గతంలో తనను సీఐడీ అదుపులోకి తీసుకున్న క్రమంలో దాడిచేశారని మర్రోమన్న రఘురామ రాజు.. ఇప్పుడు నిఘా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను కొట్టడం నేరమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా కానిస్టేబుల్ ఇంటి బయట ఉన్న చిత్రాలు అక్కడి సీసీ కెమరాలో లభ్యమయ్యాయి. రెక్కీ అని రఘురామరాజు భద్రతా సిబ్బంది.. కాదు నేను బయట ఉంటే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని కానిస్టేబుల్ చెబుతున్నారు. దీంతో ఎలా ముందుకెళ్లాలో మీడియాకు సైతం తోచడం లేదు. రఘురామరాజు విషయంలో సైలెంట్ అయిపోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చారు.
Also Read: Gopichand In NTR Movie: ఎన్టీఆర్ సినిమాలో గోపీచంద్.. ఫాన్స్ కి ఇక పండగే
[…] […]