Ram Charan: మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోశక్తి లేదు. ఈ సినిమామీద మెగాస్టార్ అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. అంటే ఈ సినిమా విషయంలో వశిష్ఠ గాని మెగాస్టార్ చిరంజీవి గాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి వాటిని షూట్ చేయడానికి చిరంజీవికి బదులుగా డూప్ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో సగానికంటే ఎక్కువ డూప్ ని వాడుతూ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి చిరంజీవి కూడా డూప్ లేకుండా నటిస్తాడు కానీ కొన్ని రిస్కీ షాట్స్ ఉంటే మాత్రం అవి డూప్ తో చిత్రీకరణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇంతకుముందు చిరంజీవి ఎప్పుడూ కూడా డూప్ లను ఎక్కువగా వాడేవాడు కాదు కానీ ఇప్పుడు ఆయనకి ఏజ్ కొంచం పెరిగిపోవడం వల్లనే డూప్ లను వాడాల్సి వస్తుంది. ఇంక ఇదే విషయం మీద రాంచరణ్ కూడా ఎక్కువగా డూప్ ని పెట్టుకొని షూట్ చేయమని వశిష్ఠ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.కానీ చిరంజీవికి మాత్రం డూప్ లతో చేయడం అస్సలు ఇష్టం ఉండదు.సినిమా లో ఏ సీన్ అయిన స్వయం గా ఆయనే చేయడానికి సిద్ధంగా ఉంటాడు.అందులో భాగంగానే ఈ సినిమా లో కూడా డూప్ లేకుండా షూట్ చేయడానికి చిరంజీవి సిద్దమయ్యాడు
కానీ డైరెక్టర్ కు రామ్ చరణ్ మాత్రం చిరంజీవి తో అసలు ఏ యాక్షన్ ఎపిసోడ్ కూడా డూప్ లేకుండా అయితే చేయకు అని చెప్పాడట.ఇక ఇదంతా చూస్తుంటే 70 సంవత్సరాల వయసు లో కూడా చిరంజీవికి సినిమా అంటే ఎంత డెడికేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సినీ అభిమానులు అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు అంటూ సోషల్ మీడియా వేదిక గా కామెంట్లు చేస్తున్నారు.
సినిమాలో ఏ షాట్ అయిన సరే తనే పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటాడు అది ఎంత రిస్కీ షాట్ అయినా కూడా తన హార్ట్ ఫుల్ గా తన ఎఫర్ట్ మొత్తాన్ని పెట్టేసి చేయడమే తనకు చాలా ఇష్టం అంటూ చిరంజీవి గురించి తెలిసిన చాలామంది చెబుతారు.అలాగే షూటింగ్ లొకేషన్ లో ఆయనని లైవ్ లో చూసినవాళ్లు కూడా చెప్పే మాట అదే… అందుకే చిరంజీవి ఎప్పుడైనా తనకు డూప్ లేకుండా షూటింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు…