CM Jagan: సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చారు. మరో 40 మంది వరకు మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ జాబితాను ఫైనల్ చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కన్ఫామ్ చేసిన అభ్యర్థుల జాబితాను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు
విశాఖ నార్త్ కే కే రాజు, మాడుగుల బుడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, జగ్గంపేట తోట నరసింహం, పెద్దాపురం దావులూరు దొరబాబు, ప్రత్తిపాడు పరుపుల సుబ్బారావు, పిఠాపురం వంగా గీత, ముమ్మిడివరం పొన్నాడ సతీష్, భీమవరం గ్రంధి శ్రీనివాస్, మంగళగిరి గంజి చిరంజీవి, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, నూజివీడు మేక వెంకట ప్రతాప్, కైకలూరు దూలం నాగేశ్వరరావులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మచిలీపట్నం పేర్ని కిట్టు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, తెనాలి అన్నా బత్తుల శివప్రసాద్, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్, కందుకూరు మహీధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి మేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నారాయణస్వామి, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం భరత్, జమ్మలమడుగు వైయస్ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు శివప్రసాద్ రెడ్డి, పులివెందుల జగన్మోహన్ రెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని సాయిప్రసాద్ రెడ్డి, రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుకొండ ఉషశ్రీ చరణ్, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలతో తొలి జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.