Riya Shibu
Riya Shibu : ఈ ఫొటోలో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందంతో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?, చూసేందుకు చాలా చిన్న అమ్మాయిగా కనిపిస్తుంది కదూ..ఈమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కేరళ లోని లయోలా కాలేజీ లో విస్కామ్ చదువుతుంది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మాయి, ఇంత చిన్న వయస్సులో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం వంటివి ఎలా చేస్తుంది?, ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయస్సులో ఇంత పెద్ద బాధ్యతలు ఎలా మోస్తుంది?, అసలు ఎవరూ ఈ అమ్మాయి అనేది ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. ఈమె పేరు రియా షిబు(Riya Shibu). ఈమె ప్రముఖ మలయాళం సినిమాల నిర్మాత షిబు తమీన్(Shibu Tameen). సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లు ఇలాంటి పనులు చేయడం సహజమే. కానీ ఇంత చిన్న వయస్సులో, ఒకపక్క చదువుకుంటూ మరోపక్క సినిమాలను నిర్మించే వాళ్ళను దేశంలో ఎంత మందిని చూసి ఉంటాము చెప్పండి?.
Also Read : విక్రమ్ మాస్ విశ్వరూపం.. దుమ్ములేపేసిన ‘వీర ధీర సూర’ టీజర్.. ఈసారి గురి తప్పేలా లేదు!
ఈమె స్థాపించిన ‘HR పిక్చర్స్’ సంస్థ ద్వారా కేరళలో గతంలో రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR , శివకార్తికేయన్ హీరోగా నటించిన డాన్, కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’, విజయ్ సేతుపతి నటించిన ‘మామనితిన్’ వంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాల ద్వారా వచ్చిన లాభాలతో ఇప్పుడు ఆమె ఏకంగా నిర్మాతగా మారింది. విక్రమ్, అరుణ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వీర ధీర సూరన్ 2’ చిత్రానికి ఈమెనే నిర్మాత. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, హీరో విక్రమ్ ఈమె గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు.
ఇంత చిన్న వయస్సులో ఒక అమ్మాయి ఇంత పెద్ద బాధ్యతలు నెత్తిన వేసుకోవడం ఇది వరకు నేను ఎప్పుడూ చూడలేదు, బడ్జెట్ విషయం లో డైరెక్టర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మాత్రమే కాదు, హీరోయిన్ గా కూడా మలయాళం లో కప్ అనే చిత్రంలో నటిస్తుందట. వీటితో పాటు ఇంటి బాధ్యతలు కూడా మొత్తం ఈమెనే దగ్గరుండి చూసుకుందట. చదువుకోవాల్సిన చిన్న వయస్సు లో ఇలాంటి బాధ్యతలు మోయడమంటే చిన్న విషయం కాదు. రాబోయే రోజుల్లో ఈమె ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. తమిళం, మలయాళం ఇండస్ట్రీస్ లోనే కాదు, తెలుగు లో కూడా ఈమెకు సినిమాలను నిర్మించాలని ఉందట. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారితో సినిమాలు తీయడం తన లక్ష్యం అంటూ అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.
Also Read : ప్రభాస్ సినిమాని మర్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ అరియానా..ఏకిపారేస్తున్న ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!