https://oktelugu.com/

Devara : ‘దేవర’ కటౌట్ కి జపాన్ అమ్మాయిలు ప్రత్యేక పూజలు..ఇదేమి క్రేజ్ బాబోయ్!

Devara :  జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కి జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్ #RRR తో వచ్చింది అనుకుంటే పెద్ద పొరపాటే, ఎప్పుడో 'బాద్ షా' సినిమా సమయం నుండే ఆయనకు మంచి క్రేజ్ ఉంది.

Written By: , Updated On : March 22, 2025 / 05:50 PM IST
Devara

Devara

Follow us on

Devara :  జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కి జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ క్రేజ్ #RRR తో వచ్చింది అనుకుంటే పెద్ద పొరపాటే, ఎప్పుడో ‘బాద్ షా’ సినిమా సమయం నుండే ఆయనకు మంచి క్రేజ్ ఉంది. #RRR తో అది పదింతలు రెట్టింపు అయ్యింది. అయితే #RRR తర్వాత ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాని జపాన్ దేశం లో మార్చి 27న విడుదల చేయబోతున్నారు. మార్చి 19న కొంతమంది ముఖ్యులకు అక్కడ ప్రైవేట్ స్క్రీనింగ్ వేసి చూపించారు. రెస్పాన్స్ అదిరిపోయింది. మార్చి 27 కోసం అక్కడి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Read : జపాన్ లో గ్రాండ్ గా విడుదల కానున్న ఎన్టీఆర్ ‘దేవర’..ప్రొమోషన్స్ మొదలెట్టిన మూవీ టీం!

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో చాటి చెపుతూ, జపాన్ లేడీ ఫ్యాన్స్ ఆయన కటౌట్ కి పూజలు చేస్తూ కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ కి మన తెలుగు రాష్ట్రాల్లోని మాస్ సెంటర్స్ లో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగడం చూసాము. కానీ ఇప్పుడు ఏకంగా జపాన్ ఇలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఏర్పడింది. ఈ వీడియో ని చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్, జపాన్ దేశం ఎన్టీఆర్ కి మరో సీడెడ్ ప్రాంతం లాగా అయిపోయిందని అంటున్నారు. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలకు కూడా జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ‘దేవర’ చిత్రానికి థియేటర్స్ లో కంటే ఓటీటీ లోనే ఎక్కువ రీచ్ వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 8 న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ సినిమాలలో అత్యధిక వ్యూస్ ని దక్కించుకున్న టాప్ 4 మూవీస్ లో ఒకటిగా దేవర చిత్రం నిల్చింది. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా, ఈ చిత్రాన్ని వెస్ట్రన్ కంట్రీస్ జనాలు కూడా బాగా చూసారు. అందుకే జపాన్ లో కూడా ఈ చిత్రానికి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఇక్కడ విడుదలై మంచి హిట్ అయితే, రాబోయే రోజుల్లో చైనా లో కూడా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. చూడాలి మరి ఈ సినిమా విదేశీ ఆడియన్స్ ని ఎంతమేరకు థియేటర్స్ లో అలరిస్తుంది అనేది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

Also Read : జపాన్ ప్రీమియర్ షోస్ నుండి ‘దేవర’ కి సెన్సేషనల్ రెస్పాన్స్!