Ram Charan Bday Special
Ram Charan Bday Special : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్(Global Star Ram Charan) తన తొలి సినిమా తోనే స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ని సంపాదించాడు. డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ లలో రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ తనయుడు అని కెరీర్ ప్రారంభం లోనే జనాలతో అనిపించుకున్నాడు. కానీ అందరి హీరోల లాగానే రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో, ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా అలాగే ఉన్నాయి. ‘చిరుత’, ‘మగధీర’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రామ్ చరణ్ నుండి విడుదలైన ‘ఆరెంజ్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ ఫ్లాప్ నుండి తేరుకోవడం కష్టం, చిరంజీవి కొడుకు పని అయిపోయినట్టే అని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. కానీ రామ్ చరణ్ కెరీర్ మొత్తం పడి లేవడం అనేది అప్పటి నుండే అందరికీ అర్థమైంది.
‘ఆరెంజ్’ లాంటి డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తో విడుదలైన ‘రచ్చ’ చిత్రం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు రికార్డ్స్ విషయం లో దంచి కొట్టేసింది. ఆరోజుల్లో ‘మగధీర’, ‘దూకుడు’ తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. అప్పట్లో ఈ సినిమాకి వచ్చింది కేవలం బిలో యావరేజ్ టాక్ మాత్రమే. కానీ రామ్ చరణ్ అలాంటి సినిమాతో కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి శబాష్ అనిపించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘నాయక్’ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్ కి ‘తుఫాన్’ చిత్రం పెద్ద బ్రేకర్ లాగా నిల్చింది. తెలుగుతో పాటు, హిందీ లో కూడా ఈ సినిమా డిజాస్టర్ రెస్పాన్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన ‘ఎవడు’ తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
Also Read : ‘పుష్ప’ లుక్ ని తలపించిన రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్!
ఇక ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటన విషయంలో అనేక ట్రోల్స్ ని ఎదురుకున్నాడు. అన్ని సినిమాల్లో ఒకే యాక్టింగ్ చేస్తున్నాడని విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శల నడుమ విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత విడుదలైన ‘బ్రూస్లీ’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇలా కెరీర్ లో ఒక హిట్, ఒక ఫ్లాప్ అన్నట్టుగా వెళ్తుండడం రామ్ చరణ్ కి కాస్త మైనస్ అయ్యింది. అలా నటన పరంగా విమర్శలు ఎదురుకుంటున్న సమయంలో ‘ధృవ’ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఇందులో రామ్ చరణ్ నటనని మెచ్చుకోని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘రంగస్థలం’ గురించి చెప్పుకోనవసరం లేదు. మా అభిమాన హీరో, ఈ స్థాయిలో నటిస్తే ఎంత బాగుంటుందో అని ప్రతీ ఒక్కరు అనుకునేలా చేసాడు. తనని నటన పరంగా విమర్శించిన వాళ్ళే ఈ సినిమాతో పొగిడేలా చేసుకున్నాడు.
అయితే ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘వినయ విధేయ రామ’ మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది, ఆ తర్వాత #RRR వంటి హిట్ వచ్చింది. గ్లోబల్ వైడ్ గా గుర్తింపు లభించింది. కానీ ఈ సినిమా తర్వాత ఆయన నుండి విడుదలైన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఒక హిట్ తీస్తే, వెంటనే మరో ఫ్లాప్ ఇవ్వడం రామ్ చరణ్ కి అలవాటు అయిపోయింది. కానీ ఆయన కం బ్యాక్ ఇచ్చినప్పుడల్లా మన తెలుగు సినిమా స్థాయి వేరే లెవెల్ కి వెళ్తూ రావడం ఇన్ని రోజులు మనం చూసాము. కానీ రామ్ చరణ్ లో ఉన్న పెద్ద మైనస్ ఏమిటంటే సినిమా సినిమాకు ఆయన భారీ గ్యాప్ ఇవ్వడమే. అయితే ఇప్పుడు ఆయన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ షేపులు మారిపోయే రేంజ్ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Also Read : రామ్ చరణ్ బర్త్ డే కి రచ్చ రచ్చ చేయనున్న అభిమానులు…