https://oktelugu.com/

Uttar Pradesh : ప్రియుడితో భార్యకు పెళ్లి.. దగ్గరుండి జరిపించిన భర్త

Uttar Pradesh : పెళ్లి(Marrage) అనేది జీవితంలో ఒక్కసారి చేసుకునే మధుర కార్యం. భారతీయ వైవాహిక బంధానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నేటి ఆధునిక పోకడలతో పెళ్లికి ముందు.. ఒకరితో పెళ్లి తర్వాత ఒకరితో అన్నట్లుగా అమ్మాయిలు.. అబ్బాలు వ్యవహారం సాగిస్తున్నారు. దీంతో సంసారాలు గుల్ల చేసుకుంటున్నారు.

Written By: , Updated On : March 27, 2025 / 01:55 PM IST
Husband Wedding to lover in UP

Husband Wedding to lover in UP

Follow us on

Uttar Pradesh : భారత వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గుర్తింపు, గౌరవం ఉంది. విదేశీయులు(Foriners) కూడా మన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మన జంటలు మాత్రం విదేశీ సంస్కృతికి మోజులో సంసారాలను ఆగం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు, వివాహానికి ముందు ఉన్న సంబంధాలు చాటుమాటుగా కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, విడాకులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార వివాహేతర బంధం తెలిసి.. అతనికే తన భార్యను ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఉత్తరప్రదేశ్‌(Uttarapradesh)లోని సంత్‌ కబీర్‌నగర్‌ గ్రామంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి, అతడితోనే జీవించాలని చెప్పడంతో భర్త వారిద్దరికీ స్వయంగా పెళ్లి జరిపించాడు. అంతేకాదు, వారికి ఉన్న ఇద్దరు పిల్లలను తానే పోషిస్తానని ప్రకటించడంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Also Read : నూనె వేయించే ముకుడుతో కరెంటు ఉత్పత్తి.. నీలాంటోళ్లే ఇండియాకు కావాలి సామీ

ఏం జరిగిందంటే..
వివరాల్లోకి వెళితే, బబ్లూ అనే వ్యక్తి 2017లో గోరఖ్‌పూర్‌(Ghorakpur)జిల్లాకు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. బబ్లూ జీవనోపాధి కోసం మరో ప్రాంతంలో పనిచేస్తుండగా, రాధిక తమ గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. వీరి ప్రేమ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారి, చివరకు బబ్లూకు కూడా తెలిసింది. భార్యను హెచ్చరించి, ప్రవర్తన మార్చుకోమని సూచించినా రాధిక వినలేదు. తాను ప్రియుడితోనే ఉంటానని స్పష్టంగా చెప్పింది. దీంతో బబ్లూ గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. రాధిక తన ప్రేమికుడితోనే జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

కోర్టుకు వెళ్లి..
భార్య నిర్ణయం మార్చుకోకపోవడంతో బబ్లూ చేసేది లేక, ముందుగా ఆమెతో కలిసి నోటరీ పబ్లిక్‌ కోర్టుకు వెళ్లాడు. ఆ తర్వాత ఓ ఆలయంలో రాధికను ఆమె ప్రియుడితో రెండో వివాహం చేశాడు. ఈ వివాహానికి తానే హాజరై, ఆమె ఇష్టపడిన వ్యక్తితో ఆమెను ఒక్కటి చేశాడు. అంతేకాకుండా, అంతకు ముందు వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలను తానే సంరక్షిస్తానని ప్రకటించాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఈ అరుదైన నిర్ణయాన్ని విస్మయంగా చూస్తున్నారు.

Also Read  : పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి విషయంలో వీడని మిస్టరీ