Rashmika Mandanna
Rashmika Mandanna : ప్రస్తుతం ఇండియా లో మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక(Rashmika Mandana) నే. కన్నడ సినీ పరిశ్రమ నుండి మన టాలీవుడ్ లోకి ఛలో అనే చిన్న సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈమె, అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది పుష్ప చిత్రం అనొచ్చు. అప్పటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన రష్మిక, ఈ సినిమా ద్వారా తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అలా అన్ని భాషల్లో అవకాశాలు సంపాదిస్తూ ఏ యంగ్ హీరోయిన్ కూడా దరిదాపుల్లోకి రాలేంత రేంజ్ కి వెళ్ళింది. రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలన్నీ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మనమంత చూస్తూనే ఉన్నాం.
Also Read : కెమెరా మ్యాన్ పై మనసు పారేసుకున్న హీరోయిన్ రష్మిక..వీడియో వైరల్!
‘యానిమల్’ , ‘పుష్ప 2’, ‘చావా'(Chhaava Movie) ఇలా వరుసగా చారిత్రాత్మక విజయాలతో బాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈమె సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి నటించిన ‘సికిందర్'(Sikindar Movie) అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ నెల 30 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో రష్మిక ఫుల్ బిజీ గా గడుపుతుంది. రీసెంట్ గా ఆమె ఒక ఈవెంట్ కి వచ్చినప్పుడు ఆమె కార్ సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయ్యింది. ఈ రెక్కల కారు పేరు మెర్సిడెస్ బెంజ్ , S -450. దీని విలువ అక్షరాలా రెండు కోట్ల రూపాయిలు, ఇండస్ట్రీ లో ఇలాంటి కార్లు కలిగిన హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకునే రష్మిక లాంటి హీరోయిన్స్ కి ఇలాంటి కార్లు కొనడం చాలా సాధారణమైన విషయం.
ఇకపోతే ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సికిందర్’ పై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కి ఈమధ్య కాలంలో తన రేంజ్ కి తగ్గ సూపర్ హిట్స్ పడలేదు. ఓపెనింగ్స్ విషయం లో కూడా ఒకప్పటి సల్మాన్ ఖాన్ వేరు, ఇప్పటి సల్మాన్ ఖాన్ వేరు. సుమారుగా 15 ఏళ్ళ పాటు తనకు పోటీ అనేదే లేకుండా బాలీవుడ్ ని ఏలాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు సికిందర్ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఆయన అభిమానులు అంత బలమైన నమ్మకం పెట్టుకోవడానికి మరో కారణం రష్మిక. ఈమె చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వడం, ఆ సెంటిమెంట్ తమకు కూడా కలిసి వస్తుందని నమ్ముతున్నారు, చూడాలి మరి రష్మిక సల్మాన్ పాలిట లక్కీ చార్మ్ గా మారుతుందా లేదా అనేది.
Also Read : అక్షరాలా 3300 కోట్ల రూపాయిలు..రష్మిక సంచలనం..దరిదాపుల్లో లేని పాన్ ఇండియన్ హీరోయిన్లు!