Upasana expecting twins: మెగా కోడలు ఉపాసన(Upasana Konidela) క్లిన్ కారా కి జన్మనిచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ ఎంత సంతోషించిందో, మెగా అభిమానులు అంతకు మించి సంతోషించారు. రామ్ చరణ్(Global Star Ram Charan) తర్వాత పెళ్లి అయిన వాళ్ళు కూడా పిల్లాపాపలతో సుఖంగా జీవితం గడుపుతుంటే, తమ అభిమాన హీరోకి పెళ్ళై 12 ఏళ్ళు పూర్తి అయినప్పటికీ కూడా పిల్లలు కలగకపోవడం పై మెగా ఫ్యాన్స్ లో చిన్న అసంతృప్తి ఉండేది. కానీ ఎప్పుడైతే క్లిన్ కారా పుట్టిన విషయం తెలిసిందో అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాప పేరు మీద పూజలు చేయించారు, హోమాలు జరిపించారు, ఇప్పటి వరకు ఆ పాప ముఖాన్ని చూడకపోయినప్పటికీ కూడా అభిమానులు ఇంతలా అభిమానించడం సాధారణమైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే దీపావళి కి ఉపాసన రెండవసారి సీమంతం చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ని స్వయంగా ఆమెనే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేసింది.
ఈసారి పుట్టబోయేది అబ్బాయా?, లేదా అమ్మాయా? అని అభిమానులు అంచనాలు వేసుకుంటున్న సమయం లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఉపాసన కడుపులో ఒక బిడ్డ కాదు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అంటే కవలపిల్లలకు ఉపాసన జన్మని ఇవ్వబోతుంది అన్నమాట. ఆ కావలపిల్లలు ఇద్దరూ అబ్బాయిలేనా?, లేకపోతే ఒక అమ్మాయి, ఒక్క అబ్బాయి నా? అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడక తప్పదు. కవలపిల్లలు పుట్టబోతున్నారు అనే వార్త తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇంతకంటే కావల్సినది ఇంకేమి ఉంది?, సినిమాల పరంగా రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో కొనసాగుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వ్యక్తిగత జీవితం లో కూడా రామ్ చరణ్ పరిపూర్ణత సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని శుభవార్తలు చెప్పబోతున్నారు అనేది.
ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభం లో ‘గేమ్ చేంజర్’ వంటి డిజాస్టర్ ని అందుకున్న ఆయన, ప్రస్తుతం బుచ్చి బాబు తో ‘పెద్ది’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. పెద్ది తో మెగా ఫ్యామిలీ మొత్తం గర్వించే రేంజ్ బ్లాక్ బస్టర్ ని రామ్ చరణ్ అందుకుంటాడని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.