Mobile Security Options: చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల అవసరాలు తీరుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఎలాంటి సమాచారం ఉందో తెలుసుకోవడానికి ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఒక్కోసారి ఉచితంగా సినిమాలు వస్తున్నాయి అన్న ఆశతో ibomma, Bappam వంటి వెబ్సైట్లు కూడా ఓపెన్ చేసే ఉంటారు. అయితే ఇలాంటి వెబ్సైట్లో వల్ల ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డాటా ఇతరులకు చేరుతుందని వారే చెప్పారు. ఇటీవల పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో చాలామంది డేటా మా దగ్గర ఉందని.. దానిని బయటపెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలో మొబైల్ లో కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ ను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్లో కొన్ని రకాల ఆప్షన్లను సెట్ చేసుకోవడం వల్ల పర్సనల్ డేటా లీక్ అవకుండా ఉంటుంది. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మొబైల్ అందుబాటులోకి రావడమే కాకుండా తక్కువ ధరలో ఇంటర్నెట్ కూడా ఉండడంతో రకరకాల వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేయడం వల్ల కొన్ని రకాల పర్సనల్ డేటా ఇతరులకు వెళ్లిపోతుంది. ఇలా వెళ్ళిపోకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కొన్ని సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. అందులో భాగంగా మొదటిది Chrome ఓపెన్ చేయాలి. పైన రైట్ సైడ్ లో కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు setting అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో Privacy and Security అనే ఆప్షన్పై క్లిక్ చేయగా.. Do not track అనే ఆప్షన్ పై క్లిక్ చేయగా.. దీనిని ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పర్సనల్ డేటా ఇతరులకు వెళ్లకుండా ఉంటుంది. అలాగే safe browsing అనే దానిపై క్లిక్ చేయాలి. ఇందులో మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో Enhanced Protection అనే దానిని ఎనబల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా సేఫ్ గా ఉండగలుగుతారు. అలాగే site settings అనే ఆప్షన్ లోకి వెళ్లి camera, location, microphone వంటి ఆప్షన్లను ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క పర్సనల్ డేటా ఇతరులకు వెళ్లకుండా ఉంటుంది.
అంతేకాకుండా చాలామంది గూగుల్లో సేఫ్ కానీ వెబ్సైట్లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే వీటిని ఓపెన్ చేయడమే కాకుండా కొందరు తమ వివరాలను అందిస్తుంటారు. ఇలా కొన్ని వివరాలు అందించినా.. మిగతా వాటితో వారు పర్సనల్ డేటాను పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందుగా ఇలాంటి సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసుకొని.. ఆ తర్వాత బ్రౌజింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.