Ram Charan And Sukumar: ‘రంగస్థలం’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ , సుకుమార్ రెండవ సారి చేతులు కలుపుతూ ఒక సినిమాని ప్రకటించి దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథ సిద్ధం అవ్వలేదు. ‘పుష్ప 2’ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తన సమయం మొత్తం దుబాయి లోనే గడుపుతూ వచ్చాడు. అక్కడ కూర్చొని ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ చర్చలు చేస్తూ వచ్చాడు. తన రైటింగ్ డిపార్ట్మెంట్ తో కలిసి ఒక కథని పూర్తి స్థాయిలో రెడీ చేశాడు. కానీ ఎందుకో ఆయనకు కథ పూర్తి స్థాయిలో సంతృప్తి ని ఇవ్వలేదు. దీంతో మళ్లీ కథని రీ రైట్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఆ కథ సిద్ధం కాలేదట. గతంలో రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ చిత్రాన్ని పల్లె బ్యాక్ డ్రాప్ లో చేస్తే, ఇప్పుడు మాత్రం పూర్తి యాక్షన్ మూవీ గా చేయడానికి సిద్ధం అవుతున్నాడు సుకుమార్.
ఈ కథ ని ఒక భాగంగా కాకుండా , రెండు భాగాలుగా చెప్పాలని అనుకుంటున్నాడట. ఆ దిశగా స్క్రిప్ట్ ని రెడీ చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. మరో 20 రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుంది. ఇక మార్చి నెల నుండి ఆయన ఖాళీగా ఉండాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే సుకుమార్ ఇంకా కథ ని రెడీ చేయలేదు, సుకుమార్ సినిమా కోసం రామ్ చరణ్ మరో సినిమాని ఓకే చెయ్యలేదు. దీంతో కొంతకాలం రామ్ చరణ్ ఖాళీగా ఇంట్లో కూర్చొని తన పిల్లలతో ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఒక రెండు నెలలు మాత్రమే సుకుమార్ కి రామ్ చరణ్ సమయం ఇవ్వగలడు. ఇక ఆ తర్వాత మాత్రం వేరే సినిమాని ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
ఇకపోతే రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది. ఏప్రిల్ 30 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో కళ్లారా చూసాము. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండవ పాట కోసం ఎదురు చూస్తున్నారు. అంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు.