Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా విషయంలో చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ ను స్టార్ హీరోగా మార్చడానికి చిరంజీవి చాలా వరకు కసరత్తులు చేశాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన ఓన్ డిసిజన్స్ తో సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీలో చిరంజీవి అంటే అమితమైన ఇష్టం ఉందనే విషయం మనందరికి తెలిసిందే. చిరంజీవి అతని భార్య సురేఖ వీళ్లిద్దరు అతనికి అమ్మానాన్న లాంటి వారు అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక వీళ్లిద్దరిని మినహాయిస్తే ఆ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన మనిషి ఇంకెవరైనా ఉన్నారంటే అది రామ్ చరణ్ అని చెబుతున్నాడు.
రామ్ చరణ్ కి చిన్నతనంలో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి స్కూలుకు తీసుకెళ్లడం స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం లాంటివి చేసేవాడు. ఒకసారకంగా తనకు బాధ్యతలను నేర్పింది కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి అతనితో చాలా ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేశాడు.
అందుకే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ మీద తెలియని ఒక ఎఫెక్షన్ అయితే ఏర్పడింది. దాంతో రామ్ చరణ్ ను తన అన్న కొడుకులా కాకుండా తన సొంత తమ్ముడిలా చూసుకున్నానని అందుకే రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు…
మొత్తానికైతే మెగా ఫ్యామిలీ మొత్తంలో పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమైన వ్యక్తుల్లో చిరంజీవి – సురేఖ తర్వాత రామ్ చరణ్ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రామ్ చరణ్ కి సైతం పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టం ఉందని పలు సందర్భాల్లో ఆయన తెలియజేశాడు…



