Prabhas Brother: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు ప్రభాస్… కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తను చేసిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ప్రభాస్ తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన పాన్ ఇండియా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దాంతోపాటుగా ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగబోతున్నాడు… ప్రభాస్ తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడనే విషయం చాలా మందికి తెలియదు. తను ప్రభాస్ సొంత తమ్ముడు కాదు గాని కజిన్ బ్రదర్ అయిన సిద్ధార్థ రాజ్ కుమార్ సైతం 2011వ సంవత్సరంలో ‘కెరటం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మరో సినిమా చేయలేదు. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఏది ఏమైనా కూడా కెరటం సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు అనుకున్న ప్రభాస్ తమ్ముడు డీలా పడిపోవడం ప్రతి ఒక్కరిని నిరాశపరిచింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రెబల్ స్టార్ ఫ్యామిలీలో ప్రభాస్ ఒక్కడే హీరోగా ఉండటం అతని అభిమానులను కొంతవరకు నిరాశ పరుస్తుంది. ఎందుకంటే మిగతా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి అప్పుడు కృష్ణంరాజు ఒక్కడే ఉన్నాడు.
ఇప్పుడు ప్రభాస్ ఒక్కడే ఉన్నాడు. ఎందుకని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు ఎక్కువగా ఇండస్ట్రీకి రానివ్వడం లేదు అంటు మరికొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ మాత్రం తన రేంజ్ ను పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…