Homeఎంటర్టైన్మెంట్Ram Charan Allu Arjun fan debate: రామ్ చరణ్ కి ఒకలా.. అల్లు అర్జున్...

Ram Charan Allu Arjun fan debate: రామ్ చరణ్ కి ఒకలా.. అల్లు అర్జున్ కి మరోలా.. పవన్ కళ్యాణ్ తీరుపై నెటిజెన్స్ మండిపాటు..

Ram Charan Allu Arjun fan debate: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా , సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన కొన్ని పోస్టులు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేడు అందరి కంటే ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు. సాధారణంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సోషల్ మీడియా ని ఉపయోగించే పద్దతి వేరుగా ఉంటుంది. తనకు బాగా దగ్గరైన వాళ్లకు అధికారిక అకౌంట్ నుండి కానీ, డిప్యూటీ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుండి కానీ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్లకు జనసేన పార్టీ హ్యాండిల్ నుండి కానీ , లేదంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ హ్యాండిల్ నుండి కానీ శుభాకాంక్షలు చెప్తుంటాడు. నేడు అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

అయితే అల్లు అర్జున్ అభిమానులు డిప్యూటీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్ నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాడా లేదా అని చాలాసేపటి వరకు ఎదురు చూశారు . ఎందుకంటే మార్చి 27 న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కి ఆయన డిప్యూటీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్ నుండే శుభాకాంక్షలు తెలిపాడు. అంతే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాజా ముద్ర వేసిన లెటర్ హెడ్ ని ఆయన రామ్ చరణ్ కి శుభాకాంక్షలు చెప్పడం కోసం ఉపయోగించాడు. రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇద్దరూ కూడా తన సొంత కుటుంబానికి చెందిన వాళ్ళే. కానీ రామ్ చరణ్ ని ఒకలా గౌరవించి , అల్లు అర్జున్ కి ఎదో నామమాత్రంగా శుభాకాంక్షలు తెలిపాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ వివక్ష చూపడం పై అల్లు అర్జున్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరికొంతమంది అయితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ ఇప్పటికీ నడుస్తూనే ఉందని అంటున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఏకంగా వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శిల్ప రవి కి సపోర్ట్ చేసాడు. కారణం శిల్ప రవి అల్లు అర్జున్ కి బెస్ట్ స్నేహితుడు కాబట్టి. ఈ సంఘటన నుండే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందని , అది నేడు ఇక్కడి వరకు చేరిందని అంటున్నారు. ఇక ఇరువురి హీరోల అభిమానులు అయితే ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ సంఘటన కూడా తోడు అవ్వడంతో వాళ్ళ మధ్య మరింత అగ్గి రాజేసినట్టు అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular