Royal Enfield Classic 650
Royal Enfield Classic 650 : ప్రీమియం క్రూజర్ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మార్కెట్‌లో సరికొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650ని రిలీజ్ చేసింది. కొత్త క్లాసిక్ 650 కంపెనీ పెద్ద ఇంజిన్ కెపాసిటీ కలిగిన 650సీసీ శ్రేణిలో 6వ మోడల్. క్లాసిక్ 650 అదే ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించింది. ఇది ఈ లైనప్ లోని ఇతర ప్రధాన మోడళ్లలో ఉంది. ఈ బైక్‌ను గతేడాది మిలన్ ఆటో షోలో మొదటిసారిగా ప్రదర్శించారు. ఇది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘క్లాసిక్’ లైనప్ పేరును కలిగి ఉంది. క్లాసిక్ 650లో పెద్ద ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 648సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్. ఇది 7250 ఆర్‌పిఎమ్ వద్ద 46.3 బిహెచ్‌పి పవర్, 5650 ఆర్‌పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అటాచ్ చేసి ఉంటుంది.
Also Read : రూ. 11 లక్షల లోపు బెస్ట్ సెడాన్ కార్లు ఇవే
క్లాసిక్ 650 డిజైన్
క్లాసిక్ 650 డిజైన్ విషయానికి వస్తే.. ఇది చాలా వరకు క్లాసిక్ 350 నుంచి ఇన్ స్పైర్ మోడల్. ఇందులో పైలట్ ల్యాంప్‌తో సిగ్నేచర్ రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, ట్రయాంగిల్ సైడ్ ప్యానెల్, బ్యాక్ గుండ్రని టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇందులో పీషూటర్-శైలి ఎగ్జాస్ట్‌ను అందించారు. బైక్‌లో చుట్టూ ఎల్‌ఈడీ లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సి-టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
క్లాసిక్ 650 స్పెసిఫికేషన్లు
క్లాసిక్ 650 సూపర్ మెటియోర్/షాట్‌గన్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఇందులో అదే స్టీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్, సబ్‌ఫ్రేమ్, స్వింగార్మ్‌ను ఉపయోగించారు. సస్పెన్షన్ కోసం ముందువైపు 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఇది డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది. అయితే, బైక్‌లో అల్లాయ్ వీల్స్‌కు బదులుగా కేవలం వైర్-స్పోక్ వీల్స్ మాత్రమే ఉండడం కొనుగోలుదారులను కొంచెం నిరాశపరచవచ్చు. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.7 లీటర్లు. సీటు ఎత్తు 800 మిమీ. గ్రౌండ్ క్లియరెన్స్ 154 మిమీ. కర్బ్ వెయిట్ 243 కిలోగ్రాములు, ఇది ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేసిన అత్యంత బరువైన బైక్.
క్లాసిక్ 650 ధర, మైలేజ్
క్లాసిక్ 650 ధర విషయానికి వస్తే, ఇది రూ. 3.37 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. క్లాసిక్ 650ని 4 కలర్ ఆఫ్షనల్లో కొనుగోలు చేయవచ్చు, అవి వల్లం రెడ్, బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ, టీల్ గ్రీన్, బ్లాక్ క్రోమ్. బైక్ బుకింగ్‌లు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. బైక్ మైలేజ్ లీటరుకు 21.45 కిమీ వరకు ఉండవచ్చు. అయితే దీని గురించి కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
కలర్ ఆఫ్షన్స్, ధరలు (ఎక్స్-షోరూమ్):
బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ: రూ. 3.37 లక్షలు
వల్లం రెడ్: రూ. 3.37 లక్షలు
టీల్ గ్రీన్: రూ. 3.41 లక్షలు
బ్లాక్ క్రోమ్: రూ. 3.50 లక్షలు
Also Read :