Sai Dharam Tej
Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంపత్ నంది(Sampath Nandi) కాంబినేషన్ లో అప్పట్లో ‘గాంజా శంకర్'(Ganja Shankar) అనే చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేసారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత ప్రకటించిన మొట్టమొదటి సినిమా ఇదే. అప్పటికీ ‘విరూపాక్ష’ సినిమాని కూడా మొదలు పెట్టలేదు. అప్పుడెప్పుడో మొదలెట్టిన ఈ సినిమా ఊసే ఈమధ్య కనపడడం లేదు, అసలు ఏమైంది ఈ చిత్రం?, ఉందా లేదా? అని మెగా అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకంటే టీజర్ అలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది ఇటీవలే ఈ సినిమాపై పలు కీలక వ్యాఖ్యలు చేసాడు.
Also Read : అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడా..?
రీసెంట్ గా ఆయన తమన్నా ని ప్రధాన పాత్రలో పెట్టి ‘ఓదెల 2’ అనే చిత్రం చేసాడు. వచ్చే నెల 17వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంపత్ నంది ని ‘గాంజా శంకర్’ మూవీ గురించి విలేఖరులు అడగగా ఆయన స్పందించాడు. సంపత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా టైటిల్ ని మార్చమంటూ నాకు, హీరో గారికి పోలీసులు నోటీసులు జారీ చేసారు. గాంజా శంకర్ అంటే నేను గాంజా మీదనే సినిమా తీస్తున్నట్టు వాళ్ళు అనుకున్నారు. ఆ సినిమాలో ఎలాంటి కంటెంట్ తీస్తున్నాను అనేది నాకు, హీరో గారికి తప్ప ఎవరికీ తెలియదు. నేను ఈ చిత్రాన్ని గాంజా కి వ్యక్తిరేకంగా తీయాలని అనుకున్నాను. ఇది నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి, వాళ్లకు చెప్పి, ఒప్పించే ప్రయత్నం చేయడం కంటే, సినిమాని ఆపేయడమే బెటర్ అని ఆపేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు సంపత్ నంది.
‘గాంజా శంకర్ చిత్రం చేయలేకపోయినప్పటికీ, శంకరుడి మీద సినిమా చేసి ఓదెల 2 తో మీ ముందుకు వస్తున్నాను. కచ్చితంగా ఈ చిత్రం మీకు థియేటర్స్ లో సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనే నమ్మకం ఉంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే టైటిల్ మార్చమని చెప్పినందుకు సినిమాని ఆపేయడం ఎంత వరకు కరెక్ట్?, పోలీసులకు వివరణ ఇచ్చుకోవడానికి ఈగో అడ్డం వచ్చిందా?, సంపత్ నంది లో ఇంత యాటిట్యూడ్ ఉందని ఈరోజే తెలిసింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంపత్ నంది మంచి టాలెంట్ ఉన్న కమర్షియల్ డైరెక్టర్, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఇప్పటికీ మీడియం రేంజ్ వద్దనే ఆగిపోవడానికి కారణం ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్లే అని నెటిజెన్స్ తిడుతున్నారు.
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?