https://oktelugu.com/

Ram Charan And Buchi Babu: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Ram Charan And Buchi Babu ప్రస్తుతం తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రం గ్రాఫిక్స్ విషయంలో వేరే లెవెల్ ట్రోలింగ్ కి గురైంది. ఈ సినిమా మీద అభిమానుల్లో కూడా అంచనాలు లేవు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ మీదనే కోటి ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.

Written By: , Updated On : March 23, 2025 / 04:55 PM IST
Ram Charan And Buchi Babu

Ram Charan And Buchi Babu

Follow us on

Ram Charan And Buchi Babu: మెగా అభిమానులు మొత్తం ఇప్పుడు రామ్ చరణ్(Global Star Ram Charan), బుచ్చి బాబు(Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలం లో మిగిలిన పాన్ ఇండియన్ హీరోలతో పోలిస్తే మెగా హీరోలు బాగా వెనుకబడ్డారు. ఒక పక్క ఎన్టీఆర్ ‘దేవర’ తో, మరోపక్క ప్రభాస్ ‘కల్కి’ తో, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టారు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ కి ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తగిలింది. ఇక పవన్ కళ్యాణ్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు కావొస్తుంది. ఎప్పుడు ఆయన నుండి సినిమా విడుదల అవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇక చిరంజీవి సంగతి తెలిసిందే ‘భోళా శంకర్’ ఘోరమైన డిజాస్టర్.

Also Read: సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!

ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం గ్రాఫిక్స్ విషయంలో వేరే లెవెల్ ట్రోలింగ్ కి గురైంది. ఈ సినిమా మీద అభిమానుల్లో కూడా అంచనాలు లేవు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ మీదనే కోటి ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. బుచ్చి బాబు రామ్ చరణ్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ఇస్తాడని, పాన్ ఇండియా లెవెల్ లో రామ్ చరణ్ ఈ చిత్రంతో వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొడుతాడని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వీడియో ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 న విడుదల చేయబోతున్నారట. ఈ టీజర్ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సుకుమార్ రామ్ చరణ్ కోసం రంగస్థలం లాంటి సంచలనాత్మక చిత్రం తీస్తే, ఆయన శిష్యుడు బుచ్చి బాబు దాన్ని తలదన్నే సినిమాని తీసాడని ఈ టీజర్ ని చూసిన తర్వాత అందరికి అర్థం అవుతుందట.

ఒకే ఒక్క టీజర్ తో దేశం మొత్తం రామ్ చరణ్ వైపు చూస్తుందని, అభిమానులు గర్వం తో కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని అంటున్నారు. ‘గేమ్ చేంజర్’ సినిమా టీజర్ దగ్గర నుండే అభిమానులను ఆకట్టుకోవడం లో విఫలమైంది. ఎదో పాత చింతకాయ పచ్చడి నే తిప్పి కొడుతున్నారు అన్నట్టుగా ‘గేమ్ చేంజర్’ ప్రమోషనల్ కంటెంట్ అనిపించింది. అందుకే ఈ సినిమాపై హైప్ ఏర్పడలేదు. ఫలితంగా ఓపెనింగ్స్ దగ్గర నుండే ట్రేడ్ ని నిరాశపరుస్తూ వచ్చింది. ఇక థియేట్రికల్ లాంగ్ రన్ విషయం లో సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. కానీ రామ్ చరణ్,బుచ్చి బాబు సినిమా అలా ఉండదట, టీజర్ విడుదల తర్వాత మాట్లాడుకుందాం అంటూ మూవీ టీం చాలా ధీమాగా చెప్తుందట. చూడాలి మరి అంతా ఈ టీజర్ లో ఏముంది అనేది.