https://oktelugu.com/

Rakul Preet Singh’s First Look from Konda Polam : ‘ఓబులమ్మ’గా రకుల్ ప్రీత్ సింగ్ !

Rakul Preet Singh’s First Look from Konda Polam: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రానున్న ‘కొండపొలం’ సినిమా నుండి క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రకుల్ పూర్తి గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా కనిపించింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేశాడు. ఇక […]

Written By:
  • admin
  • , Updated On : August 23, 2021 / 09:41 AM IST
    Follow us on

    Rakul Preet Singh’s First Look from Konda Polam: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రానున్న ‘కొండపొలం’ సినిమా నుండి క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రకుల్ పూర్తి గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా కనిపించింది.

    మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘కొండపొలం'(Konda Polam) అనే సినిమా చేసుకున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.

    పూర్తి గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా రకుల్ ఈ సినిమాలో ఓబులమ్మ పాత్రలో కనిపించబోతుంది. ఆమె గొర్రెలు కాసుకునే గిరిజన యువతిగా ఈ సినిమాలో నటిస్తోంది. ఒక విధంగా రకుల్ కెరీర్ లోనే పూర్తి భిన్నమైన పాత్ర ఇది. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కావడంతో ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది.

    దీనికితోడు మొన్న ఈ సినిమా నుండి వచ్చిన మోషన్‌ పోస్టర్‌ లాంటి చిన్నపాటి వీడియో కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయింది. మెయిన్ గా వైష్ణవ్‌ తేజ్‌ గడ్డం లుక్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. దాంతో సినిమా పై అంచనాలను రెట్టింపు అయ్యాయి. మరోపక్క ఉప్పెన భారీ విజయం సాధించడం కూడా వైష్ణవ్‌ తేజ్‌ కి బాగా కలిసి వచ్చింది.

    ఇక ఈ కొండ పొలెం సినిమా ఎప్పుడో పూర్తి అయింది. కాకపోతే కరోనాతో పాటు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకం పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు.