https://oktelugu.com/

Hyderabad Vaccination : హైదరాబాద్ లో ఉన్నోళ్లు త్వరపడండి

గ్రేటర్ హైదరాబాద్ లో ఉండేవారికి ఇది ఇది గుడ్ న్యూస్. ఇన్నాళ్లు టీకా వేసుకోలేని వారు త్వరగా త్వరపడండి. నేటి నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జంట నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దీంతో తెలంగాణ ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 4846 కాలనీల, బస్తీలతో పాటు కంటోన్మెంట్ లోని 360 బస్తీలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2021 / 09:16 AM IST
    Follow us on

    గ్రేటర్ హైదరాబాద్ లో ఉండేవారికి ఇది ఇది గుడ్ న్యూస్. ఇన్నాళ్లు టీకా వేసుకోలేని వారు త్వరగా త్వరపడండి. నేటి నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జంట నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతోంది.

    కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దీంతో తెలంగాణ ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 4846 కాలనీల, బస్తీలతో పాటు కంటోన్మెంట్ లోని 360 బస్తీలు, కాలనీల్లో ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 175 మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు టీకా కార్యక్రమం కోసం కాలనీలకు బయలుదేరాయి.

    ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్వదేశంలో తయారైన టీకాలతోపాటు విదేశీ ఔషధ సంస్థలకు చెందిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలకు టీకా ఆవశ్యకత పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. తెలంగాణని 100శాతం వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రెడీ అయ్యారు.

    త్వరలోనే దేశంలో థర్డ్ వేవ్ విజృంభించడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేశాయి.

    రాబోయే 10-15 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను 100శాతం పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్ ను మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.