తమిళనాడులోని(Tamil Nadu) కిజతువాల్ లో వినోభరాజన్ కు నాలుగేళ్ల క్రితం 25 ఏళ్ల కనిమొళితో వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వారికి సంతానం కలగలేదు. దీంతో మామ వారి బలహీనతను ఆసరాగా చేసుకుని నిత్యం మాటలతో తిప్పలు పెట్టేవాడు. చివరకు కోడలు తన కోరిక తీర్చాలని ప్రయత్నించాడు. అయితే ఈ పన్నాగాన్ని గమనించిన కోడలు కనిమొలి మామ మురుగేషన్ చేష్టలకు విసిగిపోయింది. అయినా అతడిలో మార్పు రాలేదు. ఓ రోజు కొడుకు ఇంట్లో లేని సమయం చూసి లైంగికదాడి చేశాడు. తన కోరిక తీర్చుకున్నాడు. ఇదే అదనుగా భావించి పలుమార్లు ఇలా చేసేవాడు.
దీంతో విసిగిపోయిన కనిమొళి మామను ఎలాగైనా అంతమొందదించాలని పథకం రచించింది. ఇన్నాళ్లుగా సాగుతున్న మామ చేష్టలకు విసిగిపోయిన ఆమె మామ తినే అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టింది. దీంతో దాన్ని తిన్న మామ ఊపిరి ఆగస్టు 1న పోయింది. అయినా వారి సంప్రదాయ ప్రకారం అతడిని ఖననం చేశారు కానీ ఆమె మామను చంపిన బాధతో ఆందోళనకు గురైంది. చివరికి గ్రామ పాలనాధికారి హరికృష్ణ ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
కోడలకు తోడుండాల్సిన మామ వికృత చేష్టలతో భరించలేకపోయిన ఆమె చివరికి అతడినే అంతమొందించింది. నిత్యం కొడుకు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి తన కోరిక తీర్చాలని వెంటపడి మరీ వేధించేవాడు. అతడి బారి నుంచి రక్షించుకునే క్రమంలో కనిమొళి తన సంసారం సజావుగా సాగాలంటే మామ అడ్డు తొలగించుకోవాల్సిందేనని భావించి ఈమేరకు అన్నంలో విషం కలిపి తినేలా చేసింది.