https://oktelugu.com/

Rakesh Master Third Wife: రాకేష్ మాస్టర్ మూడో భార్యను నడిరోడ్డులో చితకబాదిన మహిళలు… పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వ్యవహారం!

పెరుగు పెద్దమ్మ, నెల్లూరు భారతి, దుర్గ, లల్లీ అనే మహిళలు తనపై దాడి చేసినట్లు వెల్లడించారు. నేను యూట్యూబ్ లో పాప్యులర్ అయ్యాను. నన్ను నా ఛానల్ వదిలేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నాపై దాడి చేసేందుకు నెల్లూరు భారతి లక్ష రూపాయల సుపారీ ఇచ్చింది. నేను యూట్యూబ్ నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తూ దాడి చేశారని లక్ష్మి వెల్లడించారు. పోలీస్ కేసు పెట్టిన నేపథ్యంలో వారిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 8, 2023 / 11:07 AM IST

    Rakesh Master Third Wife

    Follow us on

    Rakesh Master Third Wife: ఇటీవల రాకేష్ మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మూడో భార్యగా చలామణి అవుతున్న లక్ష్మిని ఐదుగురు మహిళలు చితకబాదారు. కాపు కాసి నడి రోడ్డులో అటాక్ చేశారు. ఈ దాడిలో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన మహిళల మీద ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఘటనపై లక్ష్మి మీడియాతో మాట్లాడారు.

    పెరుగు పెద్దమ్మ, నెల్లూరు భారతి, దుర్గ, లల్లీ అనే మహిళలు తనపై దాడి చేసినట్లు వెల్లడించారు. నేను యూట్యూబ్ లో పాప్యులర్ అయ్యాను. నన్ను నా ఛానల్ వదిలేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నాపై దాడి చేసేందుకు నెల్లూరు భారతి లక్ష రూపాయల సుపారీ ఇచ్చింది. నేను యూట్యూబ్ నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తూ దాడి చేశారని లక్ష్మి వెల్లడించారు. పోలీస్ కేసు పెట్టిన నేపథ్యంలో వారిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు.

    అయితే లక్ష్మి మీద దాడి చేసిన వారిలో ఒకరైన లల్లీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించింది. దానికి మరొక కారణం ఆమె బయటపెట్టారు. లక్ష్మిని చితకబాదిన మాట నిజమే. నా కూతురు మీద లక్ష్మి తన ఛానల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసింది. అవమానించింది. దాంతో మైనర్ అయిన నా కూతురు స్కూల్ కూడా మానేసింది. అందుకు ప్రతీకారంగా లక్ష్మి మీద దాడి చేస్తామన్నారు.

    అయితే ఈ వివాదం వెనుక అసలు కారణం వేరే అని సమాచారం. రాకేష్ మాస్టర్ తో సన్నిహితంగా ఉంటున్నప్పుడు ఆయన ఛానల్ లక్ష్మి స్వాధీనం చేసుకుందట. ఆ ఛానల్ హక్కుల విషయంలోనే గొడవలు అనే ప్రచారం జరుగుతుంది. రాకేష్ మాస్టర్ వద్దకు వంట మనిషిగా వచ్చిన లక్ష్మి ఆయనకు దగ్గరయ్యారు. రాకేష్ మాస్టర్ ఆమెను తన భార్యగా పరిచయం చేశాడు. అనంతరం వీరు విడిపోయారు. రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు.