https://oktelugu.com/

Rakesh Master – Shekhar Master : శేఖర్ మాస్టర్ ముందే ఆస్తి పేపర్లు చించేసిన రాకేష్ మాస్టర్ మామయ్య

నాకు ఎందుకు ఈ ఆస్తి. రాకేష్ మాస్టర్ సంపాదించింది ఏదైనా ఆయన కుటుంబానికి చెందాలి. అందుకే ఆయన ఇచ్చిన బాండ్ పేపర్ అందరి ముందు చించేస్తున్నాను, అని ఆయన ఆ పేపర్ చించేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2023 / 09:27 AM IST
    Follow us on

    Rakesh Master – Shekhar Master : హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దశదిన కర్మ నిర్వహించారు. రాకేష్ మాస్టర్ శిష్యులైన శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాకేష్ మాస్టర్ సంస్మరణ సభలో చిత్ర ప్రముఖులు, డాన్సర్స్, కళాకారులు పాల్గొన్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ మామయ్య అని పిలుచుకునే పెద్దాయన ఒకరు మాట్లాడారు. ఆయన మాటల్లో రాకేష్ మాస్టర్ ఔన్నత్యం మరోసారి బయటపడింది. 

     
    ఆయన మాట్లాడుతూ… నాది స్టంట్ డిపార్ట్మెంట్. విజయవాడలో మా ఇంటి పక్కనే శేఖర్ మాస్టర్ ఇల్లు ఉండేది. అప్పుడు చాలా చిన్నవాడు. వాళ్ళ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. శేఖర్ డాన్సర్ కావాలనుకుంటున్నాడు. పరిశ్రమలో ఎవరి దగ్గరైనా చేర్పించిండని వాళ్ళ మామయ్య నన్ను అడిగాడు. నేను ముక్కు రాజు దగ్గరకు తీసుకెళ్ళాను. అక్కడ ముక్కురాజు శిష్యుడిగా రాకేష్ మాస్టర్ ఉన్నాడు. అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు. శేఖర్ నేను రాకేష్ మాస్టర్ వద్ద చేరుతానని చెప్పాడు. 
     
    అలా రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, నేను దగ్గరయ్యాం. ముగ్గురం కలిసి ప్రయాణం చేశాం. అనేక కష్టాలు పడ్డాం. నిలువ నీడ కూడా ఉండేది కాదు. రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ సంపాదన నాకే తెచ్చి ఇచ్చేవారు. మామయ్య నీ దగ్గరే పెట్టు అనేవారు. ఆ డబ్బులు దాచి నేను బోరబండలో ఇల్లు కొన్నాను. రాకేష్ మాస్టర్ మంచి పని చేశావ్ మామయ్య అన్నాడు. అందరం ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ ఇంటిలో ఎవరెవరికి ఎంత వాటా అని కూడా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. 
     
    తర్వాత నేను విజయవాడ వచ్చేశాను. ఎవరి దారులు వారివి అయ్యాయి. రాకేష్ మాస్టర్ మాత్రం నన్ను మర్చిపోలేదు. మామయ్య నువ్వు ఎక్కడున్నా నిన్ను చూసుకోవడానికి నేనున్నాను. ఎంతో కొంత డబ్బులు పంపిస్తాను అనేవాడు. నువ్వు ముందు చనిపోతే నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. ఒకవేళ నేను చనిపోతే ఈ యూట్యూబ్ ఛానల్ లో వాటా తీసుకో. ఆ ఛానల్ మనిద్దరిదీ. ఈ ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం చేశాను. నీకు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు. 
     
    కొడుకులా చూసుకున్న వాడే పోయాడు. నాకు ఎందుకు ఈ ఆస్తి. రాకేష్ మాస్టర్ సంపాదించింది ఏదైనా ఆయన కుటుంబానికి చెందాలి. అందుకే ఆయన ఇచ్చిన బాండ్ పేపర్ అందరి ముందు చించేస్తున్నాను, అని ఆయన ఆ పేపర్ చించేశారు. కేవలం తనతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి గురించి రాకేష్ మాస్టర్ అంత బాధ్యతగా ఆలోచించాడని పలువురు కొనియాడుతున్నారు.