YouTuber Lally: రాకేష్ మాస్టర్ మూడో భార్యను అందుకే కొట్టాం… యూట్యూబర్ లల్లి సంచలన వ్యాఖ్యలు!

లల్లి వర్గం కూడా తిరిగి లక్ష్మి మీద పోలీస్ కేసు పెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన లల్లి వివాదం గురించి వివరణ ఇచ్చారు. లక్ష్మి నేను మిత్రులం. కలిసి వీడియోలు చేసేవాళ్ళం. తాను నాతో చేసిన వీడియోలకు డబ్బులు ఇచ్చేదాన్ని. ఓ వీడియో విషయంలో మాతో గొడవ పడింది. నన్ను దుర్భాషలాడింది. అయినా నేను ఏమీ అనలేదు. నాకు ఓ పాప ఉంది. తనను కూడా లక్ష్మి తిట్టింది. తప్పుగా మాట్లాడింది.

Written By: Shiva, Updated On : July 15, 2023 1:28 pm

YouTuber Lally

Follow us on

YouTuber Lally: ఇటీవల రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మి మీద నడి రోడ్డులో దాడి జరిగింది. ఆమెను దారుణంగా కొందరు మహిళలు కొట్టారు. గాయాలతో లక్ష్మి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన మీద లల్లి, నెల్లూరు భారతి, దుర్గ, పెరుగు పెద్దమ్మ అనే మహిళలు దాడి చేశారని, దారుణంగా కొట్టారని లక్ష్మి ఆరోపించారు. యూట్యూబ్ లో నేను పాప్యులర్. ఇకపై వీడియోలు చేయొద్దు. యూట్యూబ్ వదిలేయాలని బెదిరిస్తున్నారు. నేను నిరాకరించినందుకు నన్ను కొట్టారంటూ లక్ష్మి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారని లక్ష్మి చెప్పుకొచ్చింది.

లల్లి వర్గం కూడా తిరిగి లక్ష్మి మీద పోలీస్ కేసు పెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన లల్లి వివాదం గురించి వివరణ ఇచ్చారు. లక్ష్మి నేను మిత్రులం. కలిసి వీడియోలు చేసేవాళ్ళం. తాను నాతో చేసిన వీడియోలకు డబ్బులు ఇచ్చేదాన్ని. ఓ వీడియో విషయంలో మాతో గొడవ పడింది. నన్ను దుర్భాషలాడింది. అయినా నేను ఏమీ అనలేదు. నాకు ఓ పాప ఉంది. తనను కూడా లక్ష్మి తిట్టింది. తప్పుగా మాట్లాడింది.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే నేను లక్ష్మి మీద దాడి చేశాను, అని లల్లి చెప్పుకొచ్చింది అయితే ఒక యూట్యూబ్ ఛానల్ విషయంలో వీరికి గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇక నిజం ఏమిటనేది వారికే తెలియాలి. లక్ష్మి, లల్లి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.

ఇక లక్ష్మి రాకేష్ మాస్టర్ కారణంగా ఫేమస్ అయ్యింది. ఆయన వద్ద పని చేయడానికి వచ్చిన లక్ష్మి దగ్గరయ్యారు. రాకేష్ మాస్టర్ ఆమెను భార్యగా ప్రకటించాడు. కొన్నాళ్లు కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీడియోలు చేశారు. తర్వాత రాకేష్ మాస్టర్-లక్ష్మి విడిపోయారు. కాగా ఇటీవల రాకేష్ మాస్టర్ కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్ మాస్టర్ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.