Rakasa movie first day collections: యూత్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకునే ఏ సినిమాకు అయినా , ఓపెనింగ్స్ అదిరిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అది చాలా సార్లు రుజువు అయ్యింది కూడా. నిన్న విడుదలైన ‘రాకాస'(Rakasa Movie) మూవీ విషయం లో మరోసారి రుజువు అయ్యింది. ఈ సినిమా నిర్మాత , నటీనటులు, దర్శకురాలు దగ్గర నుండి , ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ వరకు ప్రతీ ఒక్కరు కుర్రోళ్లే . విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ వంటివి కూడా యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దానికి తోడు సోషల్ మీడియా లోని నెటిజెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రొమోషన్స్ కోఆడా వేరే లెవెల్ లో చేశారు. ఇంకేముంది , ట్రేడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది , కచ్చితంగా ఓపెనింగ్స్ అదిరిపోతాయని అనుకున్నారు , అదే జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు నమోదైందో ఒకసారి చూద్దాం.
ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ట్రాక్ అయిన గ్రాస్ దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. వీటితో పాటు , ఆఫ్లిన్ లో అమ్ముడుపోయిన టిక్కెట్ల గ్రాస్ ని కూడా కలుపుకుంటే మరో కోటి రూపాయిల వరకు గ్రాస్ అదనంగా రావొచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 నుండి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యిందని అంటున్నారు. షేర్ వసూళ్లు వివిధ ప్రాంతాల్లోని హైర్స్ తో కలిపి దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు వచ్చిందట. ఓవరాల్ గా ఈ చిత్రానికి విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయిలు. మొదటి రోజే దాదాపుగా 50 శాతం రికవరీ అయ్యిందని అంటున్నారు.
Also Read: ఎన్టీఆర్ ను కొట్టిన ఇద్దరు దర్శకులు… వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేయలేదు…
ఇక నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో టికెట్ సేల్స్ మంచి ఊపు మీద ఉంది. గంటకు దాదాపుగా 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దాదాపుగా మొదటి రోజు ట్రెండ్ తో సమానంగా ఉంది. వీకెండ్ మొదలైంది కాబట్టి , సాయంత్రం షోస్ నుండి భారీగా వసూళ్లు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు IPL సీజన్, ‘ధురంధర్ 2’ లాంటి బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ కూడా ఈ IPL ఎఫెక్ట్ కారణంగా ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ బాగా దెబ్బ తింటున్నాయి. అలాంటిది ఈ చిన్న సినిమా ఎంత ఎఫెక్ట్ కి గురి అవుతుందో చూడాలి.
