Homeఎంటర్టైన్మెంట్Rakasa movie first day collections: 'రాకాస' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఓపెనింగ్స్...

Rakasa movie first day collections: ‘రాకాస’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఓపెనింగ్స్ తోనే 50 శాతం బ్రేక్ ఈవెన్..

Rakasa movie first day collections: యూత్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకునే ఏ సినిమాకు అయినా , ఓపెనింగ్స్ అదిరిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అది చాలా సార్లు రుజువు అయ్యింది కూడా. నిన్న విడుదలైన ‘రాకాస'(Rakasa Movie) మూవీ విషయం లో మరోసారి రుజువు అయ్యింది. ఈ సినిమా నిర్మాత , నటీనటులు, దర్శకురాలు దగ్గర నుండి , ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ వరకు ప్రతీ ఒక్కరు కుర్రోళ్లే . […]

Rakasa movie first day collections: యూత్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకునే ఏ సినిమాకు అయినా , ఓపెనింగ్స్ అదిరిపోతాయని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అది చాలా సార్లు రుజువు అయ్యింది కూడా. నిన్న విడుదలైన ‘రాకాస'(Rakasa Movie) మూవీ విషయం లో మరోసారి రుజువు అయ్యింది. ఈ సినిమా నిర్మాత , నటీనటులు, దర్శకురాలు దగ్గర నుండి , ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ వరకు ప్రతీ ఒక్కరు కుర్రోళ్లే . విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ వంటివి కూడా యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దానికి తోడు సోషల్ మీడియా లోని నెటిజెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రొమోషన్స్ కోఆడా వేరే లెవెల్ లో చేశారు. ఇంకేముంది , ట్రేడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది , కచ్చితంగా ఓపెనింగ్స్ అదిరిపోతాయని అనుకున్నారు , అదే జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు నమోదైందో ఒకసారి చూద్దాం.

ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ట్రాక్ అయిన గ్రాస్ దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. వీటితో పాటు , ఆఫ్లిన్ లో అమ్ముడుపోయిన టిక్కెట్ల గ్రాస్ ని కూడా కలుపుకుంటే మరో కోటి రూపాయిల వరకు గ్రాస్ అదనంగా రావొచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 6 నుండి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యిందని అంటున్నారు. షేర్ వసూళ్లు వివిధ ప్రాంతాల్లోని హైర్స్ తో కలిపి దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు వచ్చిందట. ఓవరాల్ గా ఈ చిత్రానికి విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయిలు. మొదటి రోజే దాదాపుగా 50 శాతం రికవరీ అయ్యిందని అంటున్నారు.

Also Read: ఎన్టీఆర్ ను కొట్టిన ఇద్దరు దర్శకులు… వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేయలేదు…

ఇక నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో టికెట్ సేల్స్ మంచి ఊపు మీద ఉంది. గంటకు దాదాపుగా 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దాదాపుగా మొదటి రోజు ట్రెండ్ తో సమానంగా ఉంది. వీకెండ్ మొదలైంది కాబట్టి , సాయంత్రం షోస్ నుండి భారీగా వసూళ్లు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు IPL సీజన్, ‘ధురంధర్ 2’ లాంటి బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ కూడా ఈ IPL ఎఫెక్ట్ కారణంగా ఫస్ట్ షోస్ , సెకండ్ షోస్ బాగా దెబ్బ తింటున్నాయి. అలాంటిది ఈ చిన్న సినిమా ఎంత ఎఫెక్ట్ కి గురి అవుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper