Homeఎంటర్టైన్మెంట్Top young heroes in Tollywood: కుర్ర హీరోల్లో టాప్ త్రి పొజిషన్ లో ఉన్న...

Top young heroes in Tollywood: కుర్ర హీరోల్లో టాప్ త్రి పొజిషన్ లో ఉన్న హీరోలు వీళ్లే…

Top young heroes in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోల హవా ఎక్కువైపోయింది. స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం డీలాపడిపోతున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోల్లో ఎవరు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు అనే విషయం మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి. ప్రస్తుతం నాని నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. తను నెంబర్ […]

Top young heroes in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోల హవా ఎక్కువైపోయింది. స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం డీలాపడిపోతున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోల్లో ఎవరు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు అనే విషయం మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి. ప్రస్తుతం నాని నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. తను నెంబర్ వన్ హీరోగా ఉండటమే కాకుండా తనదైన రీతిలో తన మార్కును చూపిస్తూ సినిమాలను చేస్తూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుండటం విశేషం… తనకు వరుసగా ఒక రెండు భారీ విజయాలు దక్కితే మాత్రం ఆయన టైర్ వన్ హీరోగా మారిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఆయన చేసిన సినిమాలు ఆయన టాప్ లెవల్లో నిలబెట్టాయి.

కానీ ఇక మీదట చేయబోతున్న సినిమాలతో ఆయన మరింత ముందుకు సాగాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఈయన తర్వాత పొజిషన్లో తేజ సజ్జా ఉండటం విశేషం. హనుమాన్, మిరాయి లాంటి వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం…

Also Read: ఎన్టీఆర్ ను కొట్టిన ఇద్దరు దర్శకులు… వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేయలేదు…

మిరాయి సినిమా దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది…కాబట్టి ప్రస్తుతం ఆయన టాప్ పొజిషన్లో ఉన్నాడనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరి తర్వాత పొజిషన్ లో విజయ్ దేవరకొండ కొనసాగుతూ ఉండటం విశేషం… గతంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించడం లేదు.

అయిన కూడా ఆయన టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు అంటే అతనికి ఉన్న క్రేజ్ వల్లే ఆయన ఆ రేంజ్ లో ఉన్నాడని చెప్పాలి… ప్రస్తుతం ఆయన చేస్తున్న రౌడీ జనార్దన్, రణబాలి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper