Homeఎంటర్టైన్మెంట్Junior NTR: ఎన్టీఆర్ ను కొట్టిన ఇద్దరు దర్శకులు... వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేయలేదు...

Junior NTR: ఎన్టీఆర్ ను కొట్టిన ఇద్దరు దర్శకులు… వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేయలేదు…

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు తన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. కెరియర్ మొదట్లోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే డిఫరెంట్ తరహా సినిమాలను ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘వార్ 2’ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ […]

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు తన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. కెరియర్ మొదట్లోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే డిఫరెంట్ తరహా సినిమాలను ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘వార్ 2’ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డిలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క సరైన సక్సెస్ కూడా దక్కలేదు. కాబట్టి తన తోటి హీరోలందరు వేల కోట్ల కలెక్షన్లు సంపాదిస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా వందల కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగిపోయాడు… అక్కడ డ్రాగన్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి ఆయన ఇమేజ్ ని ముందుకు తీసుకెళ్తే గాని ఆయన టాప్ హీరోగా మరింత ముందుకు వెళ్లే అవకాశాలైతే లేవు… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన లైనప్ ను కూడా చాలా బాగా సెట్ చేసుకున్నాడు. డ్రాగన్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత మరికొంతమంది దర్శకులు చెప్పిన కథలను వింటున్నాడు. కానీ ఇంకా ఏవీ ఫైనల్ చేయడం లేదు…

Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలు చేసినప్పుడు కొంత మంది దర్శకులు ఆయన్ని కొట్టారనే వార్తలైతే అప్పట్లో వినిపించాయి. ‘బాల రామాయణం’ సినిమా చేసినప్పుడు ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ బాగా చేయకపోవడం సెట్లో అల్లరిల్లరిగా చేస్తుంటే దర్శకుడు గుణ శేఖర్ తనని నెత్తిమీద ఒక దెబ్బ అయితే కొట్టాడట.

కామ్ గా ఉండమని చెప్పాడట. ఇక ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా చేసే సమయంలో ఆ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. కాబట్టి అప్పటికీ 18 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ అల్లరిల్లరిగా చేస్తూ ఉండడం చిన్నపిల్లల చేష్టలు చేయడం వల్ల రాఘవేంద్రరావు కి కోపం వచ్చి తన నెత్తి మీద రెండు మొట్టికాయలు వేసి కామ్ గా ఉండు తారక్ అని చెప్పారట.

ఇలా ఆ ఇద్దరు దర్శకులు అతన్ని కొట్టడం అతనికి బాధ కలిగించిందట. దానివల్లే ఆ తర్వాత వాళ్ళిద్దరితో సినిమాలు చేయలేదని గతంలో ఒక ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో వివరించాడు. నిజానికి వాళ్లు కొట్టడం వల్ల సినిమాలు చేయలేదనేది ఫన్నీగా చెప్పాడట. ఆ తర్వాత వాళ్ళతో సినిమాలు చేద్దాం అనుకున్నప్పటికి వాళ్లు చెప్పిన కథలు ఎన్టీఆర్ కి నచ్చలేదట. అందువల్లే వాళ్లతో సినిమాలు చేయలేదట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper