సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఇతర దేశాలలో కూడా అభిమానాలు ఉన్నారు. రజిని పేరు చెబితేనే సినీ ప్రేక్షకులు అందరు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. మరి ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ రజిని మాత్రం ఎప్పుడూ సింపుల్ గానే ఉంటాడు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. పైగా ఎప్పటినుండో రజనీకాంత్ రాజకీయ నాయకుడిగా కూడా ప్రజా సేవ చేయాలని ఆశ పడుతున్నాడు. కానీ కాలం కలిసిరాక ఆ ఆశ పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది. కానీ ఈ సారి రజిని పర్ఫెక్ట్ ప్లాన్ తో రెడీ అవుతున్నాడు.
Also Read: టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన సునీత రెండో పెళ్లి..!
ఇందుకోసం అనేక ప్రణాళికలు వేసుకుంటున్నాడట. నిజానికి కరోనా అడ్డుపడకపోయి ఉంటే.. మదురైలో అక్టోబర్ 2న భారీసభ నిర్వహించి పార్టీ పేరు జెండా ప్రకటించే వారు. దీనికితోడు ఆ తరువాత రజనీకాంత్‌కు కిడ్నీ సమస్య రావడం.. 2011లో ఈ సమస్యతో బాధపడ్డ ఆయన సింగపూర్‌లో వైద్యం చేయించుకున్నారు. అది తేడా కొట్టి కొన్ని రోజులు పాటు ఇంటికే పరిమితం అయ్యారు. కిడ్నీ మార్పిడి జరగడం వలన రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందట. ఈ క్రమంలో రాజకీయ సమావేశాలు, చర్చలు జరిపినా ప్రాణాలతో చెలగాటమే అవుతుందని.. అందుకే కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకూ రజిని అన్నిటికీ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
Also Read: సమంతపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్.. అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్టు..!
అయితే వచ్చే ఏడాదే తమిళ నాడు ఎలక్షన్స్ ఉండటం, ఇప్పటి నుండి గ్రౌండ్ వర్క్ చేయకపోతే విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడటం.. అలాగే రజినికి రాజకీయ పార్టీ ప్రారంభించే ఆలోచన ఉంటే జనవరి 15 లోపే మొదలు పెట్టాలని సలహాలు ఇవ్వడంతో.. మొత్తానికి రజిని రంగంలో కి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సోమవారం( నవంబర్ 30)న తన అభిమాన సంఘం అధ్యక్షులతో మీటింగ్ ఏర్పటు చేయబోతున్నాడు. దాదాపు 9 గంటలపాటు జరగనున్న ఈ మీటింగ్‌లో రజనీకాంత్ రాజకీయారంగేట్రం గురించి ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడట. మరి చూడాలి సూపర్ స్టార్ రాజకీయాల పై క్లారిటీ ఇస్తాడా లేదా అనేది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్