https://oktelugu.com/

ఆధార్, పాన్, రేషన్ కార్డ్ పోగొట్టుకున్నారా.. కొత్తది ఎలా పొందాలంటే..?

మనలో చాలామంది ముఖ్యమైన గుర్తింపు కార్డులను పోగొట్టుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రయాణాలు చేసే సమయంలో, అజాగ్రత్త వల్లో గుర్తింపు కార్డులను పోగొట్టుకోవడం జరుగుతుంది. అయితే అలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను పోగొట్టుకున్నా సులభంగా తిరిగి పొందవచ్చు. ఆధార్ కార్డును పోగొట్టుకుంటే 18001801947 నంబర్ కు ఫోన్ చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఫిర్యాదు చేసిన వాళ్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త కార్డును పొందవచ్చు. Also Read: చెన్నైలో రైతు ఇంట్లో ఐటీ దాడులు.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2020 / 04:43 PM IST
    Follow us on


    మనలో చాలామంది ముఖ్యమైన గుర్తింపు కార్డులను పోగొట్టుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రయాణాలు చేసే సమయంలో, అజాగ్రత్త వల్లో గుర్తింపు కార్డులను పోగొట్టుకోవడం జరుగుతుంది. అయితే అలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను పోగొట్టుకున్నా సులభంగా తిరిగి పొందవచ్చు. ఆధార్ కార్డును పోగొట్టుకుంటే 18001801947 నంబర్ కు ఫోన్ చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఫిర్యాదు చేసిన వాళ్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త కార్డును పొందవచ్చు.

    Also Read: చెన్నైలో రైతు ఇంట్లో ఐటీ దాడులు.. ఎన్ని కోట్లు దొరికాయంటే…?

    సరైన ఆధారాలను చూపించి ఆధార్ కేంద్రాలలో, మీసేవా కేంద్రాలలో గుర్తింపు కార్డులను పొందవచ్చు. పాన్ కార్డ్ ప్రతి ఒక్కరీ ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. పాన్ కార్డ్ పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. పాత పాన్‌కార్డు జిరాక్స్, కలర్ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేసి 90 రూపాయలు చెల్లించడం ద్వారా పాన్ కార్డ్ ను పొందవచ్చు.

    Also Read: భారత్ పై స్మిత్ ’సెంచరీ‘ రికార్డు

    https://tin.tin.nsdl.com/ వెబ్ సైట్ ద్వారా పాన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువులను రేషన్ కార్డ్ సహాయంతో పొందవచ్చు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించి రేషన్ కార్డును పొందవచ్చు. వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ముఖ్యమనే సంగతి తెలిసిందే. పది రూపాయల బాండ్‌ పేపర్‌ పై కార్డు పోయిన వివరాలు పేర్కొని డ్రైవింగ్ లైసెస్న్ ను పొందవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: జనరల్

    ఏటీఎం కార్డు మిస్ అయితే ఆ కార్డును బ్లాక్ చేయించి సంబంధిత బ్యాంకు మేనేజర్‌ కు తెలియజేసి కొత్త కార్డును పొందవచ్చు. నిర్ణీత మొత్తంలో ఛార్జీలు చెల్లించి ఏటీఎం కార్డును పొందవచ్చు. పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుంటే 1000 రూపాయలు డీడీ తీసి పంపిస్తే డూప్లికేట్ పాస్ పోర్ట్ ను పొందవచ్చు.