Rajasaab release date : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ లేక, చాలా రోజుల నుండి తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం కనీసం ఈ ఏడాది లో అయినా విడుదల అవుతుందా లేదా అనే సందేహం లో ఉన్నారు. గత ఏడాది జెట్ స్పీడ్ లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ వెళ్లిన ఈ చిత్రం, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు ఒక్క రోజు షూటింగ్ ని కూడా జరుపుకోలేకపోయింది. ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు కానీ, ప్రభాస్ పై ఈ ఏడాది ‘రాజా సాబ్’ విషయం లో ఒక్క షాట్ ని కూడా తెరకెక్కించలేదు. ఈ సినిమా పూర్తి అవ్వాలంటే ప్రభాస్ మరో 45 రోజుల డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది.
డిసెంబర్ లో ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు కానీ, అది సాధ్యమయ్యేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి పీఆర్ గా వ్యవహరిస్తున్న SKN ఈ సినిమా టీజర్ గురించి అభిమానులు సంబరాలు చేసుకునే అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ SKN తో మాట్లాడుతూ ‘రాజా సాబ్ గురించి అప్డేట్ కోసం అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, టీజర్ సిద్ధం అయిపోయింది, కేవలం VFX వర్క్ మాత్రం బ్యాలన్స్ ఉందని అంటున్నారు. మరికొంతమంది అయితే ప్రభాస్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన ఓకే అనగానే టీజర్ ని విడుదల చేస్తారని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం, రాజా సాబ్ టీజర్ ఎప్పుడొస్తుంది’ అని అడగ్గా దానికి SKN ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.
Also Read : అసలు ‘రాజా సాబ్’ కి ఏమైంది..? ప్రభాస్ ఎందుకు అంత ఫైర్ అవుతున్నాడు!
SKN మాట్లాడుతూ ‘రాజాసాబ్ ని నిర్మాత విశ్వప్రసాద్ గారు తన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అలాగే మారుతి గారు కూడా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ చాలా అద్భుతమైన ఔట్పుట్ ని తీసుకొచ్చాడు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ లో నన్ను ట్యాగ్ చేసి అప్డేట్స్ అడుగుతుంటే నేను దానిని మారుతీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. చూస్తుంటే రెండు వారాల్లో టీజర్ వచ్చేలా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు SKN. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక పక్క ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు వరుసగా అప్డేట్స్ తో ఎంజాయ్ చేస్తుంటే ఏ అప్డేట్ లేకుండా మేము మాత్రమే బాధపడుతున్నామంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు మొత్తానికి వాళ్లకు కూడా అప్డేట్ వచ్చేసింది. ఇక టీజర్ కోసం ఎదురు చూడడమే బ్యాలన్స్.
మరో రెండు వారాలలో #TheRajaSaabTeaser వస్తుంది ❤️ – Producer #SKN#Prabhas #TheRajaSaab #Ghatikachalam #TeluguFilmNagar pic.twitter.com/dMNrNeXzWP
— Telugu FilmNagar (@telugufilmnagar) May 23, 2025