Kayadu Lohar’s Overnight Stardom: అలాగే కెరియర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడి, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని తమ అద్భుతమైన నటనతో కొన్నేళ్ల తర్వాత బాగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వరుస అవకాశాలను అందుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు హీరోయిన్లు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈమె కెరియర్ ప్రారంభంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినప్పటికీ కూడా అంతగా ఫేమస్ కాలేక పోయింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ నటించిన ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది. ఈ అమ్మడి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. ఒకప్పుడు తమిళ్ లో వరుసగా సినిమాలో నటించిన ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. వైరల్ అవుతున్న ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి బాగా ఫేమస్ అయ్యింది.
Prabhas And Mahesh Fans War: వర్షం మూవీ థియేటర్ లో దారుణం.. ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ గొడవ ఎక్కడికి దారితీసిందంటే?
దీంతో ఈమెకు తెలుగుతోపాటు, తమిళ్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.హీరోయిన్ మరెవరో కాదు డ్రాగన్ సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఖయాదు లోహర్. ఖయాదు లోహర్ 2000లో అస్సాంలో జన్మించింది. ప్రస్తుతం కయాదు వయసు 25 ఏళ్ళు. కన్నడ సినిమా ముగిల్ పేటె తో 2021లో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత 19థ్ సెంచరీ అని మలయాళ సినిమాలో 2022లో నటించింది. అల్లూరి, ఐ లవ్ యు వంటి సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక కయాదు ఓరి జాతి జాతకం అనే మలయాళ సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి శ్రీలీల అవుట్..మరో యంగ్ హీరోయిన్ కోసం హరీష్ శంకర్ వేట!
కానీ ఆ తర్వాత ఆమె రెండేళ్ల వరకు సినిమాలలో కనిపించలేదు. ఇక ఈ ఏడాది డ్రాగన్ అనే సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. డ్రాగన్ సినిమాతో ఖయాదు కి ఓవర్ నైట్ లో స్టార్డం ఏర్పడింది. సామాజిక మాధ్యమాలలో కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఎక్కడ చూసిన ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఖయాదు లోహర్ ప్రస్తుతం శింబు హీరోగా నటిస్తున్న సినిమాతో బిజీగా ఉంది. అలాగే ఈమె ఇదయం మురళి అనే సినిమా కూడా చేస్తుంది. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి.